Wednesday 28 August 2013

నా నమ్మకాన్ని మోసం చేసావ్...!

నువ్వు మోసం చేసావు..అవును నా నమ్మకాన్ని మోసం చేసావ్...!
నీ ప్రేమను నమ్మాను.. కాదు కాదు నిన్ను నమ్మాను...!
నాకు క్యారెక్టర్ లేదు అన్నావ్ కదా...!
నా క్యారెక్టర్ గురించి మాట్లాడే స్థాయి నీకు ఉందా...?
నువ్వు ఏంటో నాకు తెలుసు...కాని నినేంటో సమాజానికి తెలుసు...!
అసలు నేను అనే వాడిని నీ జీవితంలోకి రాకపోతే ఎలా ఉండేది నీ జీవితం...?
మనిషిలో ఒక్కసారే పుడుతుంది ప్రేమ అన్నావ్...?
మరి రెండో సారి పుట్టేదాన్ని ఎం అనాలి... ?మోహాం అనాల....?మోజు అనాల...?
ఆ సమాధానం నాకంటే ఎక్కువ నీకె తెలుసు కదా చెప్పగలవా మరి...?
నా జీవితంలో ఏది జరిగిన ఒక్కసారే...!
అందుకే జరిగిపోయింది ... మిగిలిపోయింది అని నేను అనుకున్న...?
కాని నువ్వు ఎం చేసావ్ నీ మోహాం నీ మోజు గురించి చెపుతూ నన్నుమానసికంగా వేదించే ప్రయత్నం చేశావు ...!
ఇప్పుడు చెప్పు ఎవరి క్యారెక్టర్ ఏంటో...?
నాలో ఉన్న ఆర్దత .. ఆవేదన కాదు ఇది... నీ మీద ఉన్న ఆవేశం.. ఆక్రోశం...ఆక్రందన...!
నీను నీల దిగజారి ప్రవర్తించవచ్చు కాని నాకు ఆ ఖర్మ పట్ట లేదు..?
ఇప్పటికైనా మారు లేకపోతే నీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది...!
-సన్నీ జర్నలిస్ట్..."

ప్రొ.జయశంకర్ సార్ కు... జనార్ధన్ సార్ కు అంకితం..."


పది జిల్లాల తెలంగాణా మీ కోసం ఎదురుచూస్తున్నది...!
నేను రాకుండానే వెళ్ళిపోయార అని ధుఖ్హా పడుతున్నది...!
మన స్వప్నం నెరవేరబోతున్నది...!
1000 మంది విద్యార్థి అమరుల ఆత్మలకు శాంతి కలిగే రోజు ఇది...!
మన ధ్యేయం, మన లక్ష్యం, మన ఆశ, ఆశయం నెరవేరే తరుణం ఇది...!
కాని ఎక్కడో వెలితి ఉద్యమ స్పూర్తిని రగిలించి తెలంగాణా ప్రజలకు పోరాటాన్ని అయుదంగా ఇచ్చిన మీరు మా మధ్య లేకపోవడం...!
సువర్ణ తెలంగాణా ప్రొ.జయశంకర్ సార్ కు... జనార్ధన్ సార్ కు అంకితం...!
ఉద్యమ సుర్యుల్లరా అందుకోండి మా ఉద్యమాభి వందనాలు...!
-సన్నీ జర్నలిస్ట్

అమరులకు అంకిత...'



 

కల నెరవేరింది...ఆశయం సిద్దించింది..1000
మంది విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరింది... నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షకు ఢిల్లీ దిగి వచ్చింది.... తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది... అమరుల ఆశయాల సాక్షిగా జయ శంకర్ సార్ స్పూర్తిగా ఏర్పడుతున్న ఈ తెలంగాణ అమరులకు అంకితమిస్తూ తెలంగాణా ప్రజానికానికి శుభాకాంక్షలు..."

జై తెలంగాణా జైజై తెలంగాణా 
-సన్నీ జర్నలిస్ట్

నీ జ్ఞాపకాలు ..."

ప్రతి నిమిషం నీ మధుర జ్ఞాపకాలతో నలిగి పోతున్న ...!
నువ్వు పంచిన అనుభూతులను ఆస్వాదిస్తున్న....!
నీ కళ్ళ జోడు లో కనిపించే ప్రతిబింబం లో నన్ను నేను నిందిన్చుకుంటున్న....!
నీ ప్రేమ లో మాధుర్యాన్ని అనుభవించాను మమకారాన్ని చవి చూసాను...!
కాని ఇప్పుడు నువ్వు దూరం అయ్యాక ఆ స్మృతులే విషం ల కనిపిస్తున్నాయి...! 
నా కొమ్మను నైనే నరికేసా అని మధన పడుతున్న....!
ఈ ఆవేదనకు..ఈ ఆలోచలనలకు సమాధానం దొరికేదెన్నడు...!
ఈ వేదన నాకు ఎన్నాళ్ళు....?
సన్నీ....!

నీ జ్ఞాపకాలు..."

నువ్వు నన్ను వదిలేసినా నీ జ్ఞాపకాలు మాత్రం నన్ను ప్రతి నిత్యం వేదిస్తున్నాయి...!
నీ ప్రేమ లో పొందిన మాధుర్యం మరెక్కడా దొరకదు అనిపిస్తుంది...!
నువ్వు నన్ను వదిలి వెళ్ళిన ఎందుకో ఆ విషయాన్ని ఇప్పటికి నమ్మలేక పోతున్న...!
నా మదిలో నువ్వు కట్టిన కోవెల పూజలు లేక వెల వెల పోతుంది...!
ఒక్కసారి ప్రత్యేక్షమై నేను ఉన్న అని నిరూపించు...!
సన్నీ...!

నా ప్రేమ ఓడింది..."

మళ్ళి రావు అనుకున్న...!
వస్తావని ఉహించలేదు...!
అయిన ఆనందంతో ఉగిసాలడుతూ ...!
నా ప్రేమ గెలిచింది అనుకున్న...!
కాని నీ ప్రేమ గెలిచి...నా ప్రేమ ఓడిందని నాకు చెప్పడానికి మళ్ళి వచ్చావు అని ఇప్పుడు అర్థం అయింది...!
నీ
సన్నీ...

జ్వరం...

జ్వరం...
ఏమైందో తనువుకు 
నా అణువుకు 
మనసుకు 
ఆత్మకు 
జ్వర జ్వలితమై 
మండుతున్నది...

ఇది ఒట్టి దేహానికా
ఆత్మ కరవైన
మనసుకా...

నీవు లేని ఈ క్షణాలన్నీ
నన్ను నిప్పుల కొలిమిలో కాల్చుతున్నా...

ఏదో తెలియని చేదుతనం నాలుకను అంటుతున్నా...

గుండె గది మూలల్లో దాగలేని
దాచలేని ఓ మూల్గు 
తీ

గా...

నీ కోసమే అన్వేషణ...!

నా జీవితం ఒక పుస్తకం అయితే.. అందులో ఒక పాఠం నువ్వు..."
నీ వల్ల తెలుసుకున్న నిజాలు ఎన్నో.. నేర్చుకున్న అనుభవాలు ఎన్నో..!
ఈ ఐదు సంవత్సరాల నీ పరిచయ ప్రయాణం నాకు మరుపురాని అనుభూతుల సంగమం...!
నువ్వు రావు అని తెలుసు... అయిన నీ కోసమే అన్వేషణ...!
-నీ సన్నీ

చాలా చాలా మిస్ అవుతున్నా.. !

చాలా చాలా మిస్ అవుతున్నా.. !
---------------------------------
ఆఫీస్ లో అలసిపోయి ఆలస్యం గా ఇంటికి వస్తే…
అక్కున చేర్చుకునే అమ్మ ఒడికి దూరంగ…
తప్పు చేస్తే ‘అలా కాదు రా.. ఇలా చేయాలి’ అని..
సరిద్దుకోవడానికి సలహాలిచ్చే నాన్నకి దూరంగ…
మంచైన-చెడైన, చేదైన-తీపైన, సంతోషమైన-బాధైన…
పంచుకునే స్నేహితులకు దూరంగ…
ఇంట్లో సరదా-సరదాగ ఎప్పుడు తిట్టుకుంటూ ..
కొట్టుకుంటూ ఉండే అన్నా-తమ్ముడికి దూరంగ..
మా వీధి వాళ్ళ పలకరింపులకు,
ఇంట్లో పిల్లలు చేసే అల్లర్లకు..
ఇలా చాలా చాలా వాటికి దూరంగ..
అలా దగ్గరలేని దూరం లోను…. మరీ దూరం లేని దగ్గరలోనూ..
ఓ మాదిరి దూరంగా ఉంటున్నాను..!
20 ఏళ్ళూగ ఇంటిపట్టున ఉన్న నేను సడెన్ గా సిటీకొచ్చేసరికి..
అంతా అయొమయంలో ఉన్నాను..
వారానికి ఒకటి లేదా రెండు సినిమాలు..
ఫ్రెండ్స్/కొలీగ్స్/రిలేటివ్స్ దగ్గరికి..
అలా కాల్షీట్స్ లేని బిజి షెడ్యుల్ గా ఉండేది..
కానీ ఇప్పుడు అమ్మానాన్నకి దూరంగా ఉండటం..
ఏదైనా ఫంక్షన్ కు పోవాలంటే దూర ప్రయాణం..
ఫ్రెండ్స్ పెళ్లిళ్లకు పోలేకపోవడం.
ఇక పండుగలు, పబ్బాలు.. అంతకు మించి..
క్లొజ్ కొలీగ్స్, ఫామిలీ, ఊర్లు తిరగడం, రిలేటివ్స్,..
ఫ్రెండ్స్, ఫంక్షన్స్, ఎంటెర్-టైన్-మెంట్స్, ఇలా ఎన్నెన్నొ అన్నీ మిస్ అవుతున్న !!!
కొన్ని కావలంటే మరి కొన్ని వదులుకోవాలి అన్నట్లు..
ఇష్టమైన రంగం లో రాణించుదామని..ఏదొ పొడిచేద్దమని..
ఊరి నుంచి ఇక్కడికొచ్చా.. పొడవటం ఏమో కానీ..
ఇక్కడ నుంచి వీలైనంత తొందరగా మా ఊరికి పోవాలని ఉంది

జీవితం...!

కంచాలలో తిని మంచాలమీద ఆరుబయట వెన్నెలలో పట్టే సుఖ నిద్ర
లంచాలను మరిగి భవనాలలో తిరిగినవారికి తప్పదు ఈ లోప ముద్ర!
చింతలు లేని ఇంట్లో అనునిత్యం దడికట్టిన సందడితో సదా నిర్భయం
ప్రహారీగోడ చుట్టూవున్నా, తలవంపులు తెచ్చే దాడులతో నిత్య భయం!
ఇంద్రభవనాలు భోగభాగ్యాలు, అను నిత్యం చచ్చిబతికే వాసయోగ్యాలు
నందనవనాలు వెన్నెల కవనాలు, ప్రకృతి ప్రసాదించిన సుఖవాసాలు..."

వేశ్య..."


వేశ్య కూడా ఆడదే
అమ్మవడిలో లాలిపాటని
నాన్న భుజాలపై మమకారాన్ని
ఆడతనానికి ఆభరణం లాంటి శీలం విలువ తెలిసిందే !

ఆకలికే తెలియంది అంగడిలో లాగే ముందు
ఆడతనం విలువ !
పూట పూటకి కామంధుల ఆకళ్ళు తీర్చాలని
విసిరే నాలుగు నోట్ల కోసం
వీధి విస్తరవ్వాలని !

కళ్ళతో చూసేదంతా నిజం కాదు
నువ్వు ఛీ అన్నా ఆ కష్టం తీరేది కాదు
వీలుంటే సంస్కరించు
లేదంటే నీ దారిన నువ్వు పో !
రోడ్డున పోయే ప్రతీ దానయ్య సంఘసంస్కర్త అంటే ఎలా
సమాజం లో నువ్వు చూడలేని చీకటి కోణాలెన్నో
ఆడతనాన్ని నిందించకు
అవసరాన్ని నిందించు... వీలుంటే నిర్మూలించు ..... !

అలుపెరుగని ప్రయాణం..."

కలలనన్నీ మోసుకుంటూ
జ్ఞాపకాల వెంట అడుగులేస్తూ
గుండెల్లో అగ్ని పర్వతాన్ని రాజేస్తూ
వెన్నెలనింత దోసిట పట్టి
ఉదయిస్తున్న సూరీణ్ణి ఆహ్వానిస్తూ
పచ్చదనాన్ని నేలంతా పరుచుకుంటూ
సాగుతున్న

అలుపెరుగని ప్రయాణం
ఊరి చివర
ఖండితుని శిరస్సులో
నవ్వునద్దేంత దాకా...


రచ్చ రమ్య.."

ఈ యాంకరమ్మను చూసారా...రోజు V6 న్యూస్ లో తీన్మార్ వార్తలతో రచ్చ చేసే మన రచ్చ రాములమ్మ...ఎంతో ఉత్సాహంతో ఉర్రుతాలుగించే ఈమె అసలు పేరు రమ్య.. ఫిజియోథెరపీ స్టూడెంట్. థర్డ్ ఇయర్ చదువుతుందట..మొత్తానికి రమ్య అలియాస్ రాములమ్మ తన మాటలతో చాల మంది అభిమానులనే సంపాదించుకుంది. అల్ ది బెస్ట్ రచ్చ రాములమ్మ.."
@ సన్నిజర్నలిస్ట్

మా వాగు..."

చెట్లూ కొమ్మలూ
చివుర్లూ తీగలూ
ఆకాశమంత నలుపుతో
నలుపంత తెల్లదనంతో
మా పెద్ద వాగు ఉప్పోగింది...
మా హన్మాజీపేట ప్రకృతి పరవశ్యంతో పులకరించింది...
తెల్లని పాలపొంగు వలే వస్తున్న ఆ అలల తాకిడి ప్రతి రైతు హృదయాన్ని పలకరిస్తుంటే...
ఆ అనుభూతుల మాధుర్యం అనుభవించడం ఎవరి తరం...?
-సన్నీ జర్నలిస్ట్

లాల్ సలాం కామ్రేడ్స్..!

ఆకుపచ్చని అరణ్యం లో చేతిలో చాయి. జబ్బకు తుపాకి వేసుకొని అనునిత్యం ఆకలితో పోరాటం...! మృగాలతో సహవాసం అన్యాయాన్ని ఎదిరించాడనికి అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టే విధంగా ముందుకు కదులుతుంటే మీ కాలి బూట్ల నుండి వచ్చే శబ్దం...! సమ సమాజ నిర్మాణన్ని నిర్మించడానికి సిద్దమవుతున్న మీకు విప్లవ జోహార్లు...!
లాల్ సలాం కామ్రేడ్స్..!
సన్నీ జర్నలిస్ట్..."

Saturday 22 June 2013

విప్లవ జ్యోతి....!

కనుమరుగు అయి పోయింది ఒక విప్లవ జ్యోతి....!
కంట నీరు పెట్టెను పది జిల్లాల జాతి...!
హర హర జయశంకర నీకు లేదుగా మరణం తెలంగాణా చరితలో నీ పేరే అమరం...!
సార్ మీ మీరు మా నుండి దూరమైన మీ లక్ష్యం మా ముందే ఉంది, దాని చేదన లో మీ స్పూర్తి మాకు ఇచ్చారు, ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చారు, ఆశయ సాధనలో ముందుంటాం, నడుస్తున్న చరిత్రను ప్రభావితం చేస్తాం.
మీ యాది లో ......."
జోహార్ జయశంకర్ సార్..."
-సన్నీ జర్నలిస్

సార్ యాధిలో..."

ఉద్యమాన్ని శ్వాసించిన ఓ మహనీయుడు దీర్ఘ విశ్రాంతిలోకి వెళ్లి అప్పుడే
రెండేళ్ళు ! తొలి విడత ఉద్యమాన్ని దశాబ్దాలుగా ప్రాణాలతో నిలిపి.. మలి దశ ఉద్యమంతో సెగ రగిల్చిన తెలంగాణ సూర్యుడు అస్తమించి నేటికి రెండు సంవత్సరాలు ! తెలంగాణ సాధనే జీవితంగా.. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఆశయంగా జీవితంగా తపించిన ప్రొఫెసర్ జయశంకర్ ప్రథమ వర్ధంతి నేడు! సీమాంధ్ర వలస పాలనలో నలిగిపోయిన తెలంగాణను.. యాచక దశ నుంచి.. శాసక దశకు తీసుకుపోవడం ఆయన కల! ఇప్పుడు ఆయన లేరు. కానీ.. ఆయన వెలిగించిన స్ఫూర్తి కాగడా సమస్త ఉద్యమశ్రేణులకు మార్గనిర్దేశనం చేస్తూనే ఉంది! ఆ వెలుగుబాటలో మరింత దూకుడుతో ఉద్యమం ముందుకుపోతూనే ఉంది! సారు లేని లోటు పూడ్చలేనిదే అయినా.. ఉద్యమ శ్రేణుల్లో ఆయన నింపి వెళ్లిన స్ఫూర్తి తెలంగాణ ఉద్యమాన్ని నానాటికీ బలోపేతం చేస్తూనే ఉంది! తెలంగాణ ఉద్యమం లక్ష్యతీరానికి సమీపంలో ఉందంటే.. అందుకు కారణం సారు వేసిన పునాదే! సారులేని తెలంగాణ.. ఇప్పుడు మళ్లీ తన ఉద్యమ బావుటాను అందు కుంటున్నది! ఉద్యమం అంటే ఆందోళనలు మాత్రమే కాదు.. భావజాల వ్యాప్తి కూడా అని నిర్వ చించిన ఉద్యమ పితా మహుని సిద్ధాంతా లను ముందుకు తీసుకు పోయేందుకు సమస్త తెలంగాణ సమాజం పునరం కితమవుతున్నది!.
-సన్నీ జర్నలిస్ట్

Sunday 28 April 2013

కలెక్టర్ బతుకమ్మ సంబరాలు... @

మీ నెత్తిన  ఎత్తిన బతుకమ్మ కరీంనగర్ జిల్లా  ప్రజల బ్రతుకుల కలయిక..."



ఇదా మన భారతం...?


ఆపదలో ఉన్నప్పుడు అంబులెన్సుకు కాల్ చేస్తం. ఆకలేస్తే పిజ్జా హాట్‌కి ఫోన్‌ చేస్తం. అంబులెన్స్‌ కంటే ముందే పిజ్జా ఇంటికి చేరుతుంది. ఎడ్యుకేషన్ లోన్‌ కంటే కార్‌ లోన్‌ త్వరగా దొరుకుతుంది. నీళ్లు లేని చోట కూడా నెట్‌వర్క్‌ ఉంటుంది. సిమ్‌కార్డులు ఫ్రీ. ఉల్లిగడ్డలు చాలా కాస్ట్‌ లీ. ఒలింపిక్స్‌ విజేతకు ప్రభుత్వం కోట్ల రూపాయలిస్తుంది. బార్డర్‌ లో సైనికుడు దేశం కోసం ప్రాణాలర్పిస్తే.. అతడి కుటుంబానికి లక్ష రూపాయాలిస్తుంది. గవర్నమెంట్‌ ఆస్పత్రులుంటాయి. ఎంతంటే అంత డబ్బు ఇస్తాం.. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోండి అంటుంది. ఆ డబ్బు ఎదరిది..? మన డబ్బే మనకే ఇచ్చి పెద్ద ఫోజు. గ్రేట్‌ గవర్నమెంట్‌.
-సన్ని జర్నలిస్ట్

వేములవాడ లో మద్యం నిషేదించండి...!


వేములవాడ..ఉత్తర తెలంగాణకే తలమానికం. దక్షిణ కాసి. సాక్ష్యాత్తు పరమ శివుడు కొలువై ఉన్న ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రం.. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ శైవ క్షేత్రం గత కొద్ది కాలంగా అపవిత్రతకు చిరునామాగా మారింది.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది దీనికి ప్రధాన కారణం ఎక్కడ లేని విధంగా హిందు మనోభావాలను దెబ్బ తీసేలా ఇక్కడ మద్యం ఏరులై పారుతుంది. దీని వల్ల భక్తుల ఆధ్యాత్మిక భావనకు ఆటంకం కలుగుతుంది. పైన భక్తి కింద ఇంకోటి అన్న చందంగా మారింది..దీనికి అడ్డు కట్ట వేయాలనే ఉద్యేశ్యం తో ఇప్పటికె పలు ప్రజా సమస్యల పరిష్కరినికి కృషి చేస్తూ..ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడుతున్న హై కోర్ట్ న్యాయవాది తీగల రాంప్రసాద్ వేములవాడ రాజన్న క్షేత్రానికి 10 కిలోమీటర్ల పరిధిలో మద్యం అమ్మకాలు నిషేదించాలని పిల్ దాకలు చేసారు. దీని పై ప్రభుత్వం చర్య తీసుకొవాలని మద్యం అమ్మకాలను నిషేదించాలని త్వరలో లోనే మధ్య రహిత వేములవాడ ను చూడాలని కోరుకుందాం... అల్ ది బెస్ట్ రాంప్రసాద్ గారు ..."

Rani Rudrama In Politics..."


మీడియా ఫీల్డ్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల యాంకర్ రాణి రుద్రమ మీడియాను వదిలి రాజకీయల్లోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాణి రుద్రమ తన సొంత నియోజకవర్గం వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రాణికి నర్సంపేట నుంచి టికెట్ ఇచ్చేందుకు తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నర్సంపేట ఇంచార్జీగా నియమించారు. దాంతో నర్సంపేట నుంచి ఆమె పోటీ చేయడం ఖాయమైపోయినట్లు చెబుతున్నారు. నిజానికి రాణి రుద్రమకు రాజకీయానుభవం లేదు. న్యూస్ యాంకర్‌గా ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. టీవీ9, సాక్షి, ఏబీఎన్, టీన్యూస్ చానళ్లలో పని చేసిన ఆమెకు ఉత్తమ యాంకర్ గా నంది అవార్డు కూడా వచ్చింది. ఏబీఎన్ లో పని చేస్తున్నప్పుడు ఆమె టీన్యూస్ కు వెళ్లింది. పొలిటికల్ ఎంట్రీ కోసమే ఆమె టీ-న్యూస్ కు వెళ్లిందని అందరు భావించారు. టీ-న్యూస్ లో మంచి హోదా, గౌరవం ఇచ్చారు. అయితే టీఆర్ఎస్ నుంచి నర్సంపేట అసెంబ్లీ స్థానం కోసం టికెట్ ఆశించి భంగపడటంతోనే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తన ప్రజెంటేషన్ తో ప్రజల్ని ఆకట్టుకున్న రాణి.. పొలిటికల్లో ఎంత వరకు సక్సెస్ అవుతారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

ఢిల్లీ లో మృగాల్ల పైచాచికం..."

ఛీ... ఛీ... మనదీ ఓబతుకేనా... కుక్కలవలే, నక్కలవలే అని శ్రీశ్రీ అన్న మాటలను ఆయన బతికుంటే మార్చేవారు, కారణం మనం ఇప్పుడు కుక్కలు, నక్కలకన్నా హీనంగా బతుకుతున్నాం. అవి జంతువులే అయినా అవి వాటిపుట్టుక నడవడిని దాటి మరోరకంగా బతకడం లేదు. కాని మనిషి తన అసలు రూపం వదలిపెట్టి మృగాని కంటే హీనంగా ప్రవర్తిస్తూ జాతి మనుగడనే భయకంపితం చేస్తున్నాడు. ఇది సాధారణ మనుషులే కాదు పాలించే పాలకులు సైతం అదే దారిని ఎంచుకోవడంతో ప్రపంచదేశాల్లో ఓవెలుగు వెలిగిన మన భరతజాతి ఇక జీవచ్ఛవంలా మారిపోయే పరిస్థితులు దగ్గరపడుతున్నాయనిపిస్థుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృటించి అత్యాచారల నిరోధానికి ప్రత్యేక చట్టం చేయడానికి కారణమైన నిర్భయ వ్యవహారం మరవక ముందే మరో చిన్నారిని ఒక క్రూర మానవ మృగం చిదిమేసిన సంఘటన దేశవ్యాప్తంగా మరో మారు దేశ ప్రజలను నేస్తేజం లో కి నెట్టింది. నిజంగా వార్త పత్రికలో ఆ చిన్నారి పై జరిగిన వికృత చర్యను చదువుతుంటేనే ఆ మ్రుగాడిని నడి రోడ్డులో నరికి చంపాలి అనే అంత ఉద్రేకం, ఉద్వేగం కలుగుతుంది. చెప్పడానికి, రాయడానికి వీలు లేకుండా ఆ నర రూప రాక్షసుడు చేసిన చేష్టలు ఘోరాతి ఘొరం ఆ క్షణాన ఆ పసి తల్లి ఎంత తల్లడిల్లి ఉంటుంది, ఆ పసి ప్రాణం ఎంత కొట్టుమిట్టదిడున్తుంది. దానిపై మన పోలీసు వ్యవస్థ స్పందిన తీరు మరి విడ్డురం ఆ పసి తల్లిని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించమని ఆందోళన చేస్తే వాడి ఆస్తులు రాసి ఇవ్వమనట్లు ప్రశ్నించిన ఆ యువతీ చెవి పగల కొట్టాడు. ఇదేనా మన ప్రజాసౌమ్యం ఇదే మనకు వచ్చిన స్వాతంత్ర్యం.
-సన్నీ జర్నలిస్ట్