Sunday 28 April 2013

కలెక్టర్ బతుకమ్మ సంబరాలు... @

మీ నెత్తిన  ఎత్తిన బతుకమ్మ కరీంనగర్ జిల్లా  ప్రజల బ్రతుకుల కలయిక..."



ఇదా మన భారతం...?


ఆపదలో ఉన్నప్పుడు అంబులెన్సుకు కాల్ చేస్తం. ఆకలేస్తే పిజ్జా హాట్‌కి ఫోన్‌ చేస్తం. అంబులెన్స్‌ కంటే ముందే పిజ్జా ఇంటికి చేరుతుంది. ఎడ్యుకేషన్ లోన్‌ కంటే కార్‌ లోన్‌ త్వరగా దొరుకుతుంది. నీళ్లు లేని చోట కూడా నెట్‌వర్క్‌ ఉంటుంది. సిమ్‌కార్డులు ఫ్రీ. ఉల్లిగడ్డలు చాలా కాస్ట్‌ లీ. ఒలింపిక్స్‌ విజేతకు ప్రభుత్వం కోట్ల రూపాయలిస్తుంది. బార్డర్‌ లో సైనికుడు దేశం కోసం ప్రాణాలర్పిస్తే.. అతడి కుటుంబానికి లక్ష రూపాయాలిస్తుంది. గవర్నమెంట్‌ ఆస్పత్రులుంటాయి. ఎంతంటే అంత డబ్బు ఇస్తాం.. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోండి అంటుంది. ఆ డబ్బు ఎదరిది..? మన డబ్బే మనకే ఇచ్చి పెద్ద ఫోజు. గ్రేట్‌ గవర్నమెంట్‌.
-సన్ని జర్నలిస్ట్

వేములవాడ లో మద్యం నిషేదించండి...!


వేములవాడ..ఉత్తర తెలంగాణకే తలమానికం. దక్షిణ కాసి. సాక్ష్యాత్తు పరమ శివుడు కొలువై ఉన్న ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రం.. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ శైవ క్షేత్రం గత కొద్ది కాలంగా అపవిత్రతకు చిరునామాగా మారింది.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది దీనికి ప్రధాన కారణం ఎక్కడ లేని విధంగా హిందు మనోభావాలను దెబ్బ తీసేలా ఇక్కడ మద్యం ఏరులై పారుతుంది. దీని వల్ల భక్తుల ఆధ్యాత్మిక భావనకు ఆటంకం కలుగుతుంది. పైన భక్తి కింద ఇంకోటి అన్న చందంగా మారింది..దీనికి అడ్డు కట్ట వేయాలనే ఉద్యేశ్యం తో ఇప్పటికె పలు ప్రజా సమస్యల పరిష్కరినికి కృషి చేస్తూ..ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడుతున్న హై కోర్ట్ న్యాయవాది తీగల రాంప్రసాద్ వేములవాడ రాజన్న క్షేత్రానికి 10 కిలోమీటర్ల పరిధిలో మద్యం అమ్మకాలు నిషేదించాలని పిల్ దాకలు చేసారు. దీని పై ప్రభుత్వం చర్య తీసుకొవాలని మద్యం అమ్మకాలను నిషేదించాలని త్వరలో లోనే మధ్య రహిత వేములవాడ ను చూడాలని కోరుకుందాం... అల్ ది బెస్ట్ రాంప్రసాద్ గారు ..."

Rani Rudrama In Politics..."


మీడియా ఫీల్డ్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల యాంకర్ రాణి రుద్రమ మీడియాను వదిలి రాజకీయల్లోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాణి రుద్రమ తన సొంత నియోజకవర్గం వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రాణికి నర్సంపేట నుంచి టికెట్ ఇచ్చేందుకు తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నర్సంపేట ఇంచార్జీగా నియమించారు. దాంతో నర్సంపేట నుంచి ఆమె పోటీ చేయడం ఖాయమైపోయినట్లు చెబుతున్నారు. నిజానికి రాణి రుద్రమకు రాజకీయానుభవం లేదు. న్యూస్ యాంకర్‌గా ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. టీవీ9, సాక్షి, ఏబీఎన్, టీన్యూస్ చానళ్లలో పని చేసిన ఆమెకు ఉత్తమ యాంకర్ గా నంది అవార్డు కూడా వచ్చింది. ఏబీఎన్ లో పని చేస్తున్నప్పుడు ఆమె టీన్యూస్ కు వెళ్లింది. పొలిటికల్ ఎంట్రీ కోసమే ఆమె టీ-న్యూస్ కు వెళ్లిందని అందరు భావించారు. టీ-న్యూస్ లో మంచి హోదా, గౌరవం ఇచ్చారు. అయితే టీఆర్ఎస్ నుంచి నర్సంపేట అసెంబ్లీ స్థానం కోసం టికెట్ ఆశించి భంగపడటంతోనే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తన ప్రజెంటేషన్ తో ప్రజల్ని ఆకట్టుకున్న రాణి.. పొలిటికల్లో ఎంత వరకు సక్సెస్ అవుతారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

ఢిల్లీ లో మృగాల్ల పైచాచికం..."

ఛీ... ఛీ... మనదీ ఓబతుకేనా... కుక్కలవలే, నక్కలవలే అని శ్రీశ్రీ అన్న మాటలను ఆయన బతికుంటే మార్చేవారు, కారణం మనం ఇప్పుడు కుక్కలు, నక్కలకన్నా హీనంగా బతుకుతున్నాం. అవి జంతువులే అయినా అవి వాటిపుట్టుక నడవడిని దాటి మరోరకంగా బతకడం లేదు. కాని మనిషి తన అసలు రూపం వదలిపెట్టి మృగాని కంటే హీనంగా ప్రవర్తిస్తూ జాతి మనుగడనే భయకంపితం చేస్తున్నాడు. ఇది సాధారణ మనుషులే కాదు పాలించే పాలకులు సైతం అదే దారిని ఎంచుకోవడంతో ప్రపంచదేశాల్లో ఓవెలుగు వెలిగిన మన భరతజాతి ఇక జీవచ్ఛవంలా మారిపోయే పరిస్థితులు దగ్గరపడుతున్నాయనిపిస్థుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృటించి అత్యాచారల నిరోధానికి ప్రత్యేక చట్టం చేయడానికి కారణమైన నిర్భయ వ్యవహారం మరవక ముందే మరో చిన్నారిని ఒక క్రూర మానవ మృగం చిదిమేసిన సంఘటన దేశవ్యాప్తంగా మరో మారు దేశ ప్రజలను నేస్తేజం లో కి నెట్టింది. నిజంగా వార్త పత్రికలో ఆ చిన్నారి పై జరిగిన వికృత చర్యను చదువుతుంటేనే ఆ మ్రుగాడిని నడి రోడ్డులో నరికి చంపాలి అనే అంత ఉద్రేకం, ఉద్వేగం కలుగుతుంది. చెప్పడానికి, రాయడానికి వీలు లేకుండా ఆ నర రూప రాక్షసుడు చేసిన చేష్టలు ఘోరాతి ఘొరం ఆ క్షణాన ఆ పసి తల్లి ఎంత తల్లడిల్లి ఉంటుంది, ఆ పసి ప్రాణం ఎంత కొట్టుమిట్టదిడున్తుంది. దానిపై మన పోలీసు వ్యవస్థ స్పందిన తీరు మరి విడ్డురం ఆ పసి తల్లిని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించమని ఆందోళన చేస్తే వాడి ఆస్తులు రాసి ఇవ్వమనట్లు ప్రశ్నించిన ఆ యువతీ చెవి పగల కొట్టాడు. ఇదేనా మన ప్రజాసౌమ్యం ఇదే మనకు వచ్చిన స్వాతంత్ర్యం.
-సన్నీ జర్నలిస్ట్

Dynamic I.A.S Officer karimnagar Collecter Smitha Sabarwal..."

ఎందరికో రోల్ మోడల్ మీ శైలి. ఎంతోమందికి స్పూర్తి మీరు. ఎందరో విద్యార్థులకు ప్రేరణ మీరు..." నిత్యం ప్రజాసమస్యల పరిష్కారం కోసమే మీ ఆలోచన.. కరీంనగర్ జిల్లాను అభివృద్ధి బాటలో నడిపెందుకే మీ ఆరాటం...! ప్రభుత్వ ఫలాలు పేదల ఇళ్ళకు చేరడమే మీ లక్ష్యం.. ఇది రెండు సంవత్సరాలుగా మీరు మా జిల్లా కోసం పడుతున్న తపన. ఉహించని విదంగా జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మీరు జిల్లా అభివృద్దికి గుండెకాయగా నిలిచారు. మీ దైర్యం, మీ తెగువ, మీ నిజాయితి, మీ పేరు చెపితేనే అక్రమార్కుల గుండెల్లో దడ..అవినీతి అధికారులకు వణుకు. రాజకీయ వత్తిలకు లొంగని మీ నైతికత. విద్య, వైద్యం మీరు చూపిన ప్రత్యేక శ్రద్ధ ఈ రోజు కరీంనగర్ పేరును రాష్ట్ర నలుమూలల వినిపించేలా చేసాయి. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా పాలనా అధికారిగా మీ భాధ్యతలు చేపట్టి ఈ రోజుతో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మీకు ఇవే మా హార్దిక కృతజ్ఞతపూర్వక శుభాకాంక్షలు. ఇక ముందు కూడా మా జిల్లాను మీరు ఇలానే ముందుండి ప్రగతి బాట లో నడిపిస్తారని ఆశిశ్తూ...
సన్నీ జర్నలిస్ట్ ... @

ఊరి కోసం స్థాపించిన స్పూర్తి పథం ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ

ఊరి కోసం స్థాపించిన స్పూర్తి పథం ఫౌండేషన్ లోగో  ఆవిష్కరణలో.. నా ఊరి మిత్రులతో  కలిసి...@














ఇదే మా జర్నలిజం.."


ప్రొఫెసర్ సంకసాల మల్లేశం.


మా ఊరి ఆణిముత్యం. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రో.సంకసాల మల్లేశం. మనిషినికి ఉన్నతికి కావాల్సింది డబ్బు కాదు, ఆత్మ విశ్వాసం, స్వయం కృషి, కష్టపడే తత్వం, అని వారిని కలిసిన సందర్బంగా వారు నాతో చెప్పిన మాటలు ఇవి. ఆ మాటలు ఇప్పటికి నా మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. హన్మాజీపేట మని రత్నాలలో ఒకరు మా ప్రొఫెసర్ సార్/

Hanmajipeta (నా ఊరు...హన్మాజీపేట)


నా ఊరు..."
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ కళలతో వన్నె తీసుకు వచ్చిన మహానుభావులకు జన్మనిచ్చిన గ్రామం హన్మాజీపేట. హన్మాజీపేట లో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కవి, ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా.
సి.నారాయన రెడ్డి జన్మించిన గ్రామం హన్మాజీపేట.

 
 ఎవరికీ అవగాహనా లేని ఒగ్గు కథకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన మరో కళకారుడు మిద్దె రాములు జన్మించింది హన్మాజీపేట లోనే.
మిద్దె రాములు

 దక్ష ణ కాశిగా ప్రసిద్ద శైవ క్షేత్రం వేములవాడకు 8 కి.మీ దూరంలో ఉన్న హన్మాజీపేట కవులతో పాటు విద్య వేత్తలకు నిలయం. గ్రామంలో జన్మించిన చాల మంది ప్రభుత్వ అధికారులుగా,రాజకీయ నాయకులుగా, ఇంజనీర్లుగా.డాక్టర్లుగా, లాయర్లుగా,  ఉపాధ్యాయులుగా, జర్నలిస్ట్ లుగా, ప్రోఫెసర్లుగా వెలుగొందుతున్నారు. 
ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్  ప్రో:మల్లేశం
ప్రస్తుతం రాష్ట్రము లోనే ప్రతిస్టాత్మక ఉద్యమ కేంద్రంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్న ప్రో:మల్లేశం కూడా ఈ గ్రామంలోనే జన్మించినారు.
మా ఊరి అందాలు

గ్రామం మౌలిక సదుపాయల విషయం లో జిల్లా స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రెండు వాగుల నడుమ నా ఊరు చక్కని సోయగాన్ని అలుముకుంది. పచ్చని పొలాల పైర గాలులు స్వాగతం పలుకుతుంటే, ప్రకృతి రమణియతలు నా ఊరు అందాలను వివరిస్తాయి. ఉరిలో ప్రవేశించగానే  ఎక్కడ కానరాని  మట్టి రోడ్లు హన్మాజీపేట అభివృద్దిని చాటుతాయి.మానేరు వాగుపై నిర్మించిన బ్రిడ్జి సి.నా. రే గారికి మా ఊరి మీదా అభిమానానికి నిదర్శనం. 2 ఎకరాల విశాల స్థలం లో స్కూల్ నిర్మాణం డా.సి.నా.రే గారి సహకారంతో జిల్లా స్థాయిలో ఉత్తమ భవనంగా  నిర్మించబడితే . అందులోని  విద్య కుసుమాలు రాష్ట్ర స్థాయిలో పరిమలిస్తున్నాయి. 
గ్రామా అభివృద్ధి కోసం యువత స్థాపించిన స్పూర్తి పథం ఫౌండేషన్
 సేవాతత్పరత లోను మా యువ కెరటాలు ఆదర్శంగా  నిలుస్తున్నారు.  విదేశాల్లో స్థిరపడిన చాల మంది ఊరి కోసం పడే తపన, చేపట్టే కార్యక్రమాల కోసం తమ వంతు చేయూతను ఇవ్వడం కోసం ప్రయత్నించడం ఇందుకు నిదర్శనం. గ్రామా అభివృద్దిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు నిర్మల్ గ్రామీణ  పురస్కారాన్ని ప్రకటించింది.   ఇంకా ఎన్నో సదుపాయాలు కల్గిన గ్రామం హన్మాజీపేట. ఇంత మంది మేధావులకు జన్మనిచ్చిన హన్మాజీపేట ఒడిలో నేను ఒదగడం.  అక్కడి నుంచి ఎదగడం నేను చేసుకున్న అదృష్టం
-సన్నీ జర్నలిస్ట్...." (హన్మాజీపేట) 



Hanmajipeta (నా ఊరు...హన్మాజీపేట ) 2


నా ఊరు..."
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ కళలతో వన్నె తీసుకు వచ్చిన మహానుభావులకు జన్మనిచ్చిన గ్రామం హన్మాజీపేట. హన్మాజీపేట లో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కవి, ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా.
సి.నారాయన రెడ్డి జన్మించిన గ్రామం హన్మాజీపేట.
 ఎవరికీ అవగాహనా లేని ఒగ్గు కథకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన మరో కళకారుడు మిద్దె రాములు జన్మించింది హన్మాజీపేట లోనే.
దక్ష ణ కాశిగా ప్రసిద్ద శైవ క్షేత్రం వేములవాడకు 8 కి.మీ దూరంలో ఉన్న హన్మాజీపేట కవులతో పాటు విద్య వేత్తలకు నిలయం. గ్రామంలో జన్మించిన చాల మంది ప్రభుత్వ అధికారులుగా,రాజకీయ నాయకులుగా, ఇంజనీర్లుగా.డాక్టర్లుగా, లాయర్లుగా,  ఉపాధ్యాయులుగా, జర్నలిస్ట్ లుగా, ప్రోఫెసర్లుగా వెలుగొందుతున్నారు. 
ప్రస్తుతం రాష్ట్రము లోనే ప్రతిస్టాత్మక ఉద్యమ కేంద్రంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్న ప్రో:మల్లేశం కూడా ఈ గ్రామంలోనే జన్మించినారు.గ్రామం మౌలిక సదుపాయల విషయం లో జిల్లా స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రెండు వాగుల నడుమ నా ఊరు చక్కని సోయగాన్ని అలుముకుంది. పచ్చని పొలాల పైర గాలులు స్వాగతం పలుకుతుంటే, ప్రకృతి రమణియతలు నా ఊరు అందాలను వివరిస్తాయి. ఉరిలో ప్రవేశించగానే  ఎక్కడ కానరాని  మట్టి రోడ్లు హన్మాజీపేట అభివృద్దిని చాటుతాయి.మానేరు వాగుపై నిర్మించిన బ్రిడ్జి సి.నా. రే గారికి మా ఊరి మీదా అభిమానానికి నిదర్శనం. 2 ఎకరాల విశాల స్థలం లో స్కూల్ నిర్మాణం డా.సి.నా.రే గారి సహకారంతో జిల్లా స్థాయిలో ఉత్తమ భవనంగా  నిర్మించబడితే . అందులోని  విద్య కుసుమాలు రాష్ట్ర స్థాయిలో పరిమలిస్తున్నాయి. సేవాతత్పరత లోను మా యువ కెరటాలు ఆదర్శంగా  నిలుస్తున్నారు.  విదేశాల్లో స్థిరపడిన చాల మంది ఊరి కోసం పడే తపన, చేపట్టే కార్యక్రమాల కోసం తమ వంతు చేయూతను ఇవ్వడం కోసం ప్రయత్నించడం ఇందుకు నిదర్శనం. గ్రామా అభివృద్దిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు నిర్మల్ గ్రామీణ  పురస్కారాన్ని ప్రకటించింది.   ఇంకా ఎన్నో సదుపాయాలు కల్గిన గ్రామం హన్మాజీపేట. ఇంత మంది మేధావులకు జన్మనిచ్చిన హన్మాజీపేట ఒడిలో నేను ఒదగడం.  అక్కడి నుంచి ఎదగడం నేను చేసుకున్న అదృష్టం
-సన్నీ జర్నలిస్ట్...." (హన్మాజీపేట) 


Great Journalist Kishore Nayak

జర్నలిజం గురుంచి జర్నలిస్టుల గురుంచి, జానపాడు అరుగుల మీద కూర్చునే వాళ్ళ దగ్గర నుంచి Supreme Court జడ్జిల దాకా అందరూ చెప్పే మాట .."విలువలు పడిపోతున్నాయి..వ్యాపారం చేస్తున్నారు.. ఎక్కడా బతకలేక ఇక్కడ కొచ్చి అడ్డదిడ్డంగా దోచుకుంటున్నారు" అని.... కానీ "కిషోర్ నాయక్ " లాంటి కలాలు జనం గళాలకి అక్షర రూపం ఇస్తూ ఉండబట్టే ఇంకా "పాత్రికేయ" వృత్తికి విలువ తరగకుండా వుంది....
అవినీతి కలాలతో ,అక్రమ కెమెరాలతో సమాజం మీద అసుద్దం గక్కుతూ రాజ్యాంగ వ్యవస్థలని చెరబడుతున్న నేటి కాలంలోనే... వ్యక్తిగత గుర్తింపు కన్నా సామాజిక బాద్యత,సామాన్యుని రక్షణ ముఖ్యమని భావించే ఎందఱో "నాయక్" లు కలాలతో,కెమేరాలతో మన చుట్టూ రక్షణగా నిలవబట్టే ఈ మాత్రం స్వేఛ్చ,స్వాతంత్ర్యం అన్నా మనకి మిగిలాయి...పాత్రికేయ వృత్తిని దివిటీలుగా వెలిగిస్తున్న "నాయక్"లందరికి వందనా
లు..