Saturday 22 June 2013

విప్లవ జ్యోతి....!

కనుమరుగు అయి పోయింది ఒక విప్లవ జ్యోతి....!
కంట నీరు పెట్టెను పది జిల్లాల జాతి...!
హర హర జయశంకర నీకు లేదుగా మరణం తెలంగాణా చరితలో నీ పేరే అమరం...!
సార్ మీ మీరు మా నుండి దూరమైన మీ లక్ష్యం మా ముందే ఉంది, దాని చేదన లో మీ స్పూర్తి మాకు ఇచ్చారు, ఆ ధైర్యాన్ని మాకు ఇచ్చారు, ఆశయ సాధనలో ముందుంటాం, నడుస్తున్న చరిత్రను ప్రభావితం చేస్తాం.
మీ యాది లో ......."
జోహార్ జయశంకర్ సార్..."
-సన్నీ జర్నలిస్

సార్ యాధిలో..."

ఉద్యమాన్ని శ్వాసించిన ఓ మహనీయుడు దీర్ఘ విశ్రాంతిలోకి వెళ్లి అప్పుడే
రెండేళ్ళు ! తొలి విడత ఉద్యమాన్ని దశాబ్దాలుగా ప్రాణాలతో నిలిపి.. మలి దశ ఉద్యమంతో సెగ రగిల్చిన తెలంగాణ సూర్యుడు అస్తమించి నేటికి రెండు సంవత్సరాలు ! తెలంగాణ సాధనే జీవితంగా.. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఆశయంగా జీవితంగా తపించిన ప్రొఫెసర్ జయశంకర్ ప్రథమ వర్ధంతి నేడు! సీమాంధ్ర వలస పాలనలో నలిగిపోయిన తెలంగాణను.. యాచక దశ నుంచి.. శాసక దశకు తీసుకుపోవడం ఆయన కల! ఇప్పుడు ఆయన లేరు. కానీ.. ఆయన వెలిగించిన స్ఫూర్తి కాగడా సమస్త ఉద్యమశ్రేణులకు మార్గనిర్దేశనం చేస్తూనే ఉంది! ఆ వెలుగుబాటలో మరింత దూకుడుతో ఉద్యమం ముందుకుపోతూనే ఉంది! సారు లేని లోటు పూడ్చలేనిదే అయినా.. ఉద్యమ శ్రేణుల్లో ఆయన నింపి వెళ్లిన స్ఫూర్తి తెలంగాణ ఉద్యమాన్ని నానాటికీ బలోపేతం చేస్తూనే ఉంది! తెలంగాణ ఉద్యమం లక్ష్యతీరానికి సమీపంలో ఉందంటే.. అందుకు కారణం సారు వేసిన పునాదే! సారులేని తెలంగాణ.. ఇప్పుడు మళ్లీ తన ఉద్యమ బావుటాను అందు కుంటున్నది! ఉద్యమం అంటే ఆందోళనలు మాత్రమే కాదు.. భావజాల వ్యాప్తి కూడా అని నిర్వ చించిన ఉద్యమ పితా మహుని సిద్ధాంతా లను ముందుకు తీసుకు పోయేందుకు సమస్త తెలంగాణ సమాజం పునరం కితమవుతున్నది!.
-సన్నీ జర్నలిస్ట్