Friday 23 November 2012

మన కాలం వీరుడు...!!


మన కాలం వీరుడు...!!
----------------------

అవును మల్లోజుల కోటేశ్వరరావు బతికి ఉన్నాడు. సజీవంగా కలల్లో కాదు. బతుకు సజీవంగా నడుస్తున్నప్పుడే కలవరపెడ్తుంటాడు. బోధిస్తుంటాడు. దారి చూపుతుంటాడు. సమాజం కుళ్లుతున్నప్పుడల్లా, ఆ కుళ్లు మురిగి, శస్త్ర చికిత్సలు అవసరమైనప్పుడల్లా మల్లోజుల సజీవంగా కదలాడుతాడు. కనీస మానవ విలువలు పాటించడానికి, మనిషి సామాజిక జీవిగా సమాజం మెరుగుదల కోసం ప్రేరకుడు కావాలనడానికి, నిజాయి


తీగా మెసలడానికి, బతుకు దారి తప్పకుండా ఉండడానికి, మనిషిలో మానవీయ విలువలు అంతరించకుండా ఉండడానికి అతనొక ‘కాన్షష్ కీపర్’. అతను చనిపోయినా బతికి ఉండే విలువ. అతనొక చరివూతను నిర్మించాడు.

దరిదాపు అదొక నలభై ఏళ్ల చరిత్ర. ఈ నేల మీద నడిచిన చరిత్ర. నిత్య యుద్ధరంగంలో కార్యక్షేవూతంలో అలుపెరుగని చరిత్ర. చరిత్ర తనను తాను కనుగొని ముప్ఫై దేళ్లకు మురిసిపోవడమే వర్తమానం. నక్సల్బరీ బెంగాల్‌లో అస్తమిస్తున్నప్పుడు పెద్దపల్లి నుంచి వెళ్లిన ఒక విప్లవకారుడు లాల్‌గఢ్ వెలిగించడం ఒక చరిత్రే. నక్సల్బరీ పతనమైందనుకున్న కానూ సన్యాల్ ఆత్మహత్య చేసుకున్నప్పుడే, కిషన్‌జీ బెంగాల్‌లో తొలి ఏనాన్, లాల్‌గఢ్‌ను విముక్తి ప్రాంతమని ప్రకటించాడు. చరివూతలో ఏమి వైవిధ్యం. కోలకతా కాఫీ క్లబ్బుల్లో డ్బైయవ దశకంలో విరిసిన మేధో విప్లవం. తేయాకు తోటల్లో ప్రతిఫలించి అదొక భారతీయ ప్రత్యామ్నాయ రాజకీయ కేంద్రంగా ఆవిష్కృతమైంది. విప్లవం వాస్తవాల పునాదుల మీద మొలిచే ఒక రొమాంటిక్ స్వప్నం. దాన్ని కలగనడమే. కానీ విప్లవాన్ని నిర్మించడం కష్టం. తన రక్తంలో విప్లవాన్ని ఉరికించి కేవలం కార్యరంగంలో మాత్రమే ఉండడం మరీ కష్టం.

పతనమైన జెండాను నిలబెట్టడం కష్టం. విప్లవాలు ఒక ప్రాంతంలో ఆరిపోతే మరో ప్రాంతంలో మొలకెత్తుతాయి. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తాయి కానీ, నిరాశలోకి, నిస్పృహలోకి, మరి పడి లేవని విరిగిన కెరటమైనట్టే ఉన్నచోట మళ్లీ విప్లవం నిర్మించవచ్చునని, నిరూపించిన ప్రథమ భారతీయ విప్లవకారుడు కిషన్ జీ. ఆ తొలి ఏనాన్ నిజార్థంలో ఒక విముక్తి ప్రాంతమా? అదొక అపసవ్యపు పరికల్పనా? అరకొర అల్పసంతోషపు, అతివాద, దుందుడుకు ప్రకటనా? అది ఇవ్వా ళ ఉందా? అవన్నీ వేరు. కానీ బెంగటిల్లిన విప్లవాల ఖిల్లా బెంగాల్‌లో ఆయన లాల్‌గఢ్‌ను కన్నాడు. గ్రేట్. విప్లవం రొమాంటిక్‌గానే ఉంటుంది. కుదురుగా ఉన్న ప్రపంచాన్ని అది కుదిపికుదిపి ఇబ్బంది పెడుతుంది. కుదురుగానూ, నిశ్చలంగానూ, స్థిరంగానూ ఉన్న సమాజాలనది అల్లకల్లోలం చేస్తుంది. లాల్‌గఢ్ అదే చేసింది. సీపీఎం పాతుకున్న పునాదులను పెకిలించింది. కట్టుకున్న వెలిసిపోయిన ఎర్రకోటలను కూల్చింది. బెంగాల్ ప్రపంచాన్ని అది మేల్కొలిపింది.

మన్ను దిన్న పాముల్లా , జర్దాపాన్‌లు నములుతూ, చేపలు తింటూ విప్లవాలను ఆరామ్ పడక కుర్చీలకు పరిమితం చేసిన భద్రలోకపు మేధావులను అది దిగ్గున మేల్కొలిపింది. కాఫీ క్లబ్బుల్లో నెత్తురు నిండింది. బెంగాల్‌ను నలభై సంవత్సరాల క్రితం చారుమజుందార్, కానూ సన్యాల్, జంగల్ సంథాల్ ఆవహించారు. ఇప్పుడు బెంగాల్‌ను కిషన్‌జీ ఆవహించాడు. చరివూతను నిరాకరించలేం. కిషన్‌జీ ఇప్పటికిప్పుడే ఒక చరి త్ర కూడా కాదు. ఒక మనిషి జీవితకాలపు శక్తి యుక్తుల గురించి మాట్లాడుకుం దాం. విప్లవం గురించి అట్లా విడిచిపెడదాం. ఒక మనిషి ఎనిమిది రాష్ట్రాల్లో తన పాదమువూదలు వేయడం ఎలా సాధ్యం. ఒక మనిషి ఎనిమిది రాష్ట్రాల్లో ఆంధ్రవూపదేశ్ నుంచి ఆసోం దాకా విప్లవాల కలలను ఎగజల్లడం ఎలా సాధ్యం. ఆ మనిషి ఎక్కడుంటే అక్కడ ఒక సైన్యం తయారు కావడం ఎలా సాధ్యం. ఆయనేమన్నా... జానపద హీరోనా..? వేయి చేతులు, వేల కాళ్లు, లక్షల ఆలోచనలు ఏకకాలంలో అనేక పనులు చేయగలిగిన మహిమాన్వితుడా? కాదు. మల్లోజుల కోటేశ్వరరావు ఒక మనిషి. మామూలు మనిషి. ప్రేమగా మాట్లాడే మనిషి. ప్రేమగా నలుగురితో నవ్వుతూ మాట్లాడే మనిషి.

కానీ కలలుగనే మనిషి. కాల్పనిక జగత్తుగల మనిషి. రొమాంటిక్ రెవల్యూషనరీ.. అతనికి ‘డేర్ టు డ్రీమ్’ తెలుసు. కోటేశ్వరరావు ఒక అగ్రశేణి, అత్యుత్తమ విప్లవకారుడు. నమ్మిన విశ్వాసాల కోసం కార్యరంగం ప్రజలే అని, నేల తల్లి విముక్తి కోసం దేశవ్యాప్త విప్లవాన్ని కలగన్నాడు మల్లోజుల. ఆ కల సాకారం కోసం ఆయన దేశం మనిషి అయ్యాడు. బెంగాల్‌లో కిషన్‌జీ అయ్యాడు. చియాపస్ కొండల్లో సబ్ కమాండెంట్(జపటిస్టా) మార్కోస్ లాగే అతను సిద్ధాంత కర్త. కవి. కలలు కనేవాడు. కలలను ఏరుకుని నిజం చేయడానికి ఎకె 47 ధరించేవాడు. కలష్నికోవ్ గురిపె మార్కోస్ మాజీ మావోయిస్టు. క్రిస్తాంబుల్‌కు గుర్రం మీద ఊరేగి దేశీ మూలవాసుల సేనను ప్రదర్శించాడు మార్కోస్. నెట్‌నిండా నిండి ఉన్నడు మార్కోస్. మల్లోజుల కోటేశ్వరరావు మావోయిస్టు. మూడున్నర దశాబ్దాలుగా ఆయన కరీంనగర్ నుంచి జంగల్ మహల్ దాకా కార్యాచరణలో ఉన్నాడు.

ఉత్త బోలు నైజమున్న, పనికిరాని చెత్తను జర్నలిజంగా ప్రచారంచేసే ఆత్మలేని ఢిల్లీ నగరపు పత్రికలు ‘కిల్లింగ్ మెషిన్ కిషన్‌జీ’ అని అభివర్ణించిన మల్లోజుల అమ్మకు ఉత్తరం రాయగలడు. అమ్మా ఎట్లున్నవే.. భయపడకే అమ్మా.. నేనొక యుద్ధంలో ఉన్నాను. నీ తెలంగాణ నువ్వు, నీ హైదారాబాద్ నువ్వు కాపాడుకోవాలే అమ్మా!అని ఆప్యాయంగా అక్షర సందేశాలు పంపించగలడు. కవిత్వం రాయగలడు. ప్రపంచం ప్రశాంతంగా, ఏ దోపిడీ, పీడన లేకుండా ఆదివాసీ, మూలవాసీ , కార్మికుడు, రైతు, ప్రపంచ పీడన, దోపిడీలేని ఒక మహత్తర సమాజాన్ని కలగనగలడు. విప్లవకారుడి ఆత్మ పీడకున్ని పసిగడుతుంది. దోపిడీని పసి గడ్తుంది. పీడితుల వేపు కొట్టుకుంటుంది. ఒక సైన్యాన్ని తయారు చేస్తుంది. ఇదం తా సాధ్యమా? అనుకుంటుంది ప్రపంచం. సాధ్యమే అంటాడు విప్లవకారుడు. పీడితుల సైన్యాన్ని తయారు చేయడమే కిషన్‌జీ లక్ష్యం. అయిదారేళ్లు విప్లవకారులుగా ఉండొచ్చు. ఇక చాలు అనుకున్నప్పుడు ఎవరి కలుగులోకి వారు దూరి అప్పుడప్పుడు కలుగులోంచి బయటకొచ్చి విప్లవాల గురించి మాట్లాడవచ్చు.

కానీ జీవితాంతం విప్లవకారునిగా ఉండే వాడే ఒక చరిత్ర నిర్మాత. భారతీయ విప్లవంలో ఒక చారుమజుందార్‌తో పోల్చదగిన పెద్దపల్లి విప్లవకారుడు మల్లోజుల. అతను జీవితకాలపు విప్లవకారుడు. ముప్పది నాలుగేళ్లుగా అతను ప్రజల్లో ఉన్నా డు. ఒక్క పోలీసులకు తప్ప సమస్త ప్రపంచంలోనూ అతనున్నాడు. ఒక సృజనశీలి మేధావిగా అతను ప్రపంచాన్ని శాసించాడు. అంగీకరిస్తావా? అంగీకరించవా? సిద్ధాంతం తప్పా? ఒప్పా? తుపాకి గొట్టంతో విప్లవం వస్తుందా? రాదా? ఇవన్నీ మర్యాదస్తుడి మనాదలు. అతనికే మనాదలు లేవు. అతనొక నిరంతర విశ్వాసంతో విప్లవం కోసం పనిచేశాడు. తెలంగాణ ఒక ఆత్మ కోటేశ్వరరావు. తెలంగాణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని అజేయంగా, అమేయంగా ప్రజల మనిషిలా జీవించిన వాడు కిషన్‌జీ. తొలి తెలంగాణ ఉద్యమం మల్లోజులను మలిచింది. అది జగి త్యాల జైత్రయాత్రగా ఊరేగింది. అది ‘రోడ్ టు రెవల్యూషన్’గా భారతదేశపు విప్ల వం అయింది. మలి తెలంగాణ మల్లోజుల మద్దతు పొందింది. ఒక యుద్ధ వారసత్వం, కత్తి పట్టిన వాడి తెగువ చూపిన వారసత్వం, తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం కిషన్ జీది.

అతను భారతదేశంలో ఒక తెలంగాణ అరుణ నక్షవూతంలా వెలిగినవాడు. ఒక మనిషి తనజీవిత కాలంలో కోటానుకోట్ల మంది నాలుకల మీద నానడం అంత సులభమైందేమీ కాదు. ఒక మనిషి కోట్ల మందికి ఇతడే మా హీరో అనిపించి ఒక విముక్తి ప్రదాతగా కనిపించడం సులభం కాదు. ఒక జీవిత కాలంలో నమ్మిన సిద్ధాంతాన్ని, ఆచరించడం, ఆచరణాత్మక అన్వయంతో సిద్ధాంతాన్ని పరిపుష్టం చేసుకోవడం, విప్లవాన్ని క్షేత్రంలో ప్రయోగించి, అస్త్ర శస్త్రాలు తయారు చేసుకోవడం, ఒక కల కనడం.. ఆ కల కోసం పరితపించడం, పనిచేయడం, నేలమీద ఒక జానపద కథానాయకునిలా అనేక యుద్ధాల్లో ఆరితేరడం ఎవరికి సాధ్యం. అవన్నీ మల్లోజుల కోటేశ్వరరావు అర్థంతరంగా ముగిసిన ఒక జీవితంలోనే ఆచరించి చూపాడు. ఒక తెలంగాణ పోరాట యోధుడు తన అత్యున్నత కార్యాచరణతో ఒక చరివూతను నిర్మించాడు. భారతదేశ చరివూతలో ఇక రాసుకోండి అదొక విప్లవకారుని చరిత్ర. ఆయన పేరు మల్లోజుల కోటేశ్వరరావు. అలియస్ కిషన్‌జీ.

ఇక నుంచి ఈ దేశ విప్లవ చరిత్ర కిషన్ జీతో ప్రారంభమవుతుంది. మీరు నిరాకరిస్తారా? మీరతణ్ని ‘కిల్లింగ్ మెషిన్’ అంటారా? మీరతణ్ని మీ కలల్లోకి రాకుండా జాగ్రత్తపడతారా? మీరతణ్ని గమనించనట్టుగా ఏమరుపాటు ప్రదర్శిస్తారా? కుదరదు. ఇక నుంచీ ఈ దేశపు పోలీసులకు, ఈ దేశంలో అభివృద్ధి విధ్వంసం సృష్టించి అసమానతలు పెంచి, సంపద పోగేసి, సహజ న్యాయాలను, సహజవనరులను కొల్లగొట్టిన ప్రభుత్వాలకు, రాజ్యానికి, అతనొక పెను సవాల్. కలష్నికోవ్ ఎక్కుపెట్టిన ఒక కిషన్ జీ చరిత్ర మీకు పీడ కలలు మిగులుస్తుంది. సమాజం అస్తవ్యస్తంగా ఉన్నంత కాలం.. మనుషులు కిషన్ జీ కోసమే ఎదురుచూస్తుంటారు. అతని శవం కోసం కాదు. అతను భారత దేశపు పీడిత జనుల రక్తంలో కలిసిపోయినవాడు. కాఫీ క్లబ్‌ల్లో, రంగస్థలాల మీద అతను తారుమారు నాటకాల తెరదించగల సమర్థ యోధుడు. కలలో, మెలకువులో చిరకాలం జీవిం చి ఉండేవాడు. కిషన్ జీని చంపడం సాధ్యమా? మధురమ్మ వలపోస్తున్నది.

‘నీకు అడివిల చలి పుడుతలేదా? నిన్ను శవంగ చేసి మూటగట్టి పడేసిండ్రా? కొడుకా! కన్నపేగు కదులుతుందిరా’ కన్నతల్లి కదిలి కదిలి ఏడుస్తున్నది. కానీ పాదాలు చెక్కేసి, ముఖం చెక్కేసి కోటేశ్వరరావు పార్థివ దేహం మూటగట్టి వస్తున్నది. తట్టుకోగలవా.. తల్లీ..రాజ్యం క్రూరమైన జంతువు. అది వేటాడుతుం టుం ది. అనంతంగా.. రాజ్యానికి పీడ కలలిచ్చినవాడు కిషన్ జీ. అతని స్మృతినీ దక్కనివ్వరా! అమ్మా.. నువ్వొక చరివూతను కనిపెంచిన వీరమాతవు. కిషన్ జీ పరివ్యాప్త మవుతున్నాడు. యాదిలో... మనాదిలో...

-(అల్లం నారాయణ)

Tuesday 6 November 2012

చే గెవారా...."

చే గెవారా (Che Guevara)(జననం: జూన్ 14,1928-మరణం: అక్టోబర్ 9,1967) అసలు పేరు ఎర్నెస్టో గెవారా డి లా సెర్నా. ఇతడు దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు మరియు రాజకీయ నాయకుడు.ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థ తో పాటు సామ్యవాదం లోని సాంప్రదాయ వాదాన్ని కూడా వ్యతిరేకించాడు.ఫీడెల్ కాస్ట్రో నాయకత్వంలోని క్యూబా ప్రభుత్వం లో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడుగా చలామణీ అయ్యాడు. ఇతడు 1961 నుండి 1965 వరకు పరిశ్రమల మంత్రిగా పనిచేసి క్యూబా ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలను చాలావరకు నిర్దేశించాడు.
ఇతడు అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. 1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు. హింసాత్మక విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు.

1954 లో గౌటెమాల దేశంలో ప్రజాబాహుళ్యపు అభ్యున్నతికి కృషి చేస్తున్న సామ్యవాద అనుకూల ప్రభుత్వంతో కలసి పనిచేశాడు. కానీ అదే సంవత్సరం అమెరికా సాయంతో జరిగిన కుట్ర మూలంగా ఆ ప్రభుత్వం కూలదోయబడటంతో మెక్సికో వెళ్ళిపోయాడు. ఈ ఘటనతో అతని హింసాత్మక విప్లవ దృక్పథం మరింత బలపడింది.

మెక్సికో లో ఫీడెల్ కాస్ట్రో నాయకత్వంలో అచటికి ప్రవాసం వచ్చిన క్యూబా విప్లవకారులతో చేతులు కలిపాడు. 1950 వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టా కు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం(1956-1959)లో ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్ గా మరియు మిలిటరీ కమాండర్ గా సేవలందించాడు. ఈ సమయం లోనే ఇతను 'చే' గా పిలువబడ్డాడు.గెవారా ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతన్ని 'చే' అని పిలువనారంభించారు. అలా ఆ పేరు స్థిర పడిపోయింది.
ఈ పోరాటం విజయవంతమై కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినపుడు గెవారా పరిశ్రమల మంత్రిగా,క్యూబా జాతీయ బాంకు ప్రెసిడెంట్ గా పనిచేసాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే చే 1959 జూలై నెలలో భారతదేశం లో కూడా పర్యటించాడు. తృతీయ ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చే గెవారా క్యూబా సామ్యవాద దేశం గా మారటానికి దోహదపడ్డాడు.

గెరిల్లా యుద్దం గురించి వివరించే తన రచనలలో వర్థమాన దేశాలలో రైతాంగ విప్లవోద్యమాలు నిర్మింపబడాలని కోరుకున్నాడు. పేద దేశాలలో విప్లవాన్ని వ్యాప్తిచేయ తలపెట్టిన చే 1965 లో క్యూబాలో తన అతున్నత స్థానాన్ని, హోదాని, పలుకుబడిని అన్నింటిని వదలి పెట్టి కాస్ట్రో వారిస్తున్నా వినకుండా దేశం నుండి అదృశ్యమయ్యాడు.

కొద్దిమంది అనుచరులతో రహస్యంగా ఆఫ్రికా దేశమైన కాంగో లో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో ఆ దేశం యొక్క తూర్పు ప్రాంతంలో గెరిల్లా తిరుగుబాటుకు ప్రయత్నించి విఫలుడయ్యాడు. 1966 చివరిలో మరలా దక్షిణ అమెరికా చేరి బొలీవియా దేశంలో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారులకు నాయకత్వం వహించాడు. ఈ సమయంలోనే బొలీవియన్ సైన్యం చేత చిక్కి వారిచే అక్టోబర్ 9,1967 న వల్లెగ్రాండె అనే ప్రాంతంలో చంపబడ్డాడు. ఆ నాటి నుండి చే గెవారా విప్లవానికి, తిరుగుబాటుకు చిహ్నమై ఎందరికో ఆరాధ్యుడయ్యాడు.
ఎర్నెస్టో గెవారా డి లా సెర్నా
సన్నీ జర్నలిస్ట్...."

Saturday 3 November 2012

ఉస్మాన్ సాగర్ (గండిపేట) జలాశయం....."

1908లో ఒక్కసారి మూసీ నదికి వరదలు వస్తే స్పందించిన నిజాం బెంగులూరు నుండి ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి మూసీ నదిపై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మింపజేసాడు. నిర్మించి వందేళ్లయినా హైదరాబాదుకు నేటికీ అతి చౌకగా (కేవలం 5 రూపాయలు కిలోలీటరుకు) తాగు నీటిని అందిస్తున్నాయి ఈ జంట జలాశయాలు. దీన్నంటారు అభివృద్ధి అని.

అదే గొప్ప విజన్ ఉన్న పాలకులుగా కొందరిచే కీర్తించబడే సీమాం
ధ్ర ముఖ్యమంత్రులు మొదలు పెట్టిన కృష్ణా నది తాగు నీటి పధకం ఖర్చు 25 రూపాయలు కిలో లీటర్ : గోదావరి నది తాగునీటి పధకం అంచనా 65 రూపాయలు కిలో లీటర్.

-చిత్రంలో ఉన్నది ఉస్మాన్ సాగర్ (గండిపేట) జలాశయం.

-సన్నీ జర్నలిస్ట్

Siricilla (సిరిసిల్లలో రహీమున్నీసా...")




సిరిసిల్లలో రహీమున్నీసా ప్రదర్శించిన త్యాగము, పౌరుషం, పోరాటపటిమ అత్యంత అరుదైన ఘటన. ఆ సంఘటన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అస్సాం బాలిక కనకలత బారువా ప్రదర్శించిన అనితర సాధ్యమైన స్ఫూర్తిని గుర్తుచేస్తున్నది. ఆ అమ్మాయి అక్కడున్న రెండువేల పోలీసులను, వందలాది సీమాంధ్ర గూండాల నడుమ అద్భుతమైన ధైర్యం,సమయస్ఫూర్తి, నేర్పుతో తనను అదుపులో ఉంచిన పోలీసు వ్యాన్ ను ఎ
క్కి తన కాలి చెప్పును తీసి ఝులిపించడం ఒక ఊహా జనిత దృశ్యంలా అనిపిస్తుంది. అది నిజంగా జరిగిందంటే కూడా నమ్మలేని అసాధారణ ఘటన. మానవ చరిత్రలో పరపీడన నెదిరించి పోరాడే చావులేని స్వతంత్రేచ్చకు ఒక చక్కటి ఉదాహరణ. సాంప్రదాయ బద్దంగా కొన్ని పరిమితుల్లో ఉండే ముస్లిం సామజిక వర్గం నుండి వచ్చిన ఒక సాధారణ గ్రామీణ యువతి ఇంతటి సాహసాన్ని ప్రదర్శించిందంటే నమ్మశక్యం కాని విషయం. దీనిని బట్టి తెలంగాణ ఉద్యమం వెనుక ఎంతటి ఆవేదన దాగి ఉందో, అక్కడి ప్రజలు ఎంతటి వివక్ష, దుర్మార్గానికి గురి అయినారో, మనం అర్థంచేసుకోవచ్చు.

రహీమున్నీసా చూపించిన చెప్పు కేవలం అక్కడున్న పోలీసు, గూండాలు, విజయమ్మ, సురేఖ వారి అనుచరులపైన మాత్రమే కాదు. గత 60 సం.లలో తెలంగాణపై దాష్టీకము సాగించిన సమస్త వలసవాద వ్యవస్థ మీద. గత దశాబ్దములో తెలంగాణపై చేసిన వాగ్ధానాలు మరిచి మోసం చేసిన పార్టీలు, ప్రభుత్వాల మీద. డిసెంబర్ 9, 2009 తర్వాత తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, యువతీ యువకులపై ‘ఆంధ్ర’, కేంద్ర ప్రభుత్వాల దమననీతి మీద. 854 మంది తెలంగాణ అమరవీరుల బలిదానాలకు కారణమైన వారి మీద. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తెలంగాణపైకి వస్తున్న చంద్రబాబు, విజయమ్మల లాంటి గూండా రాజకీయ దండయాత్రల మీద. ఆ దండయాత్రలకు, హెలికాప్టర్లతో సహా వేలాది పోలీసులు; కత్తులు,కటార్లు, ఇనుపరాడ్లు, కర్రలతో వస్తున్న గూండాలకు సహాయం చేస్తున్న నేటి నిరంకుశపు రాష్ట్ర ప్రభుతం మీద. అది ఒక సింబాలిక్ చర్య. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హృదయాంతరాల్లో మండుతున్న న్యాయపూరిత ఘృణాత్మకమైన నిరసన. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇన్నేండ్ల ఆక్రోశం ఒక్కసారిగా ఉప్పెనలా ఉప్పొంగి ఆ అమ్మాయిని అంతటి సాహస కార్యాన్ని చేయడానికి పురిగొల్పింది.

ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ చేసిన రాజకీయ దండయాత్రలో తాండూరులో వీరమణి, తెలుగుదేశం గూండాలపైకి చెప్పు విసిరి తెలంగాణ పౌరుషం చాటి చెప్పింది. రాయనిగుడెంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి , మొగవాళ్ళను ఎదుర్కోలేక కేవలం ఆడవాళ్ళనే అది కూడా చెప్పులు లేకుండా ‘రచ్చబండ’ లో సమావేశపరిచాడు. అయితే రాయనిగూడెం వనితలు, కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థినులు రచ్చబండను రచ్చరచ్చచేసి మన ఘనత వహించిన ముఖ్యమంత్రిని అరగంటలోనే సమావేశం వదిలి హెలికాప్టర్ ఎక్కి పలాయనం చిత్తగించేటట్లు చేశారు.అయినా ఈ ఆంధ్ర వలసవాద దుర్మార్గులకు బుద్ది రాలేదు. నిన్నటికి నిన్న ప్రెసిడెంట్ ఎలెక్షన్ ముందు, ఎలెక్షన్ తర్వాత ఏదో చేస్తున్నామని సిగ్గులేని బొంకులు బొంకి, ఎలెక్షన్ లో వై ఎస్ ఆర్ సి పి తో కుమ్మక్కై, నేడు విజయమ్మకు రాజకీయ దండయాత్ర కు సర్వ లాంచనాలతో బందోబస్తు చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని ఎలా వర్ణించాలో పదాలు దొరకడం లేదు. కొన్ని వేల కోట్లు ప్రజల సొమ్మును దోచుకొన్న మరియు తమ ప్రభుత్వమే జైలులో పెట్టిన, తమ కాంగ్రెస్ పార్టీకి పరమ శత్రువు అయిన ఒక క్రిమినల్ రాజకీయ నాయకుడి తెలంగాణ రాజకీయ దండయాత్రకు ప్రధాన మంత్రికి తప్ప ఇతరులకు లభ్యం కానీ హెలికాప్టర్ తో సహా 10000 మంది పోలీసులనుపయోగించి బందోబస్తు చేయడం భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా జరుగలేదు. ఇదంతా కేవలము ఒక సమైక్యాంధ్ర రాజకీయ పార్టీ తెలంగాణలో యాత్ర చేయగలిగింది అని నిరూపించడానికి మాత్రమే అని తెలుసు కొంటే, ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ముఖ్యమంత్రి ఎంతటి అథఃపాతాళానికి దిగజారిపోయారో, ఈ ఆంధ్రులంతా కలిసి తెలంగాణ ప్రజలను ఇంకా ఎంతటి అవమానాలకు గురిచేయాలని సిద్ధపడుతున్నారో తెలుస్తుంది.

ఒకవైపు ఆంధ్ర దుర్మార్గం ఇలా కొనసాగుతుంటే, 80 మందికి పైబడి ఉన్న మన తెలంగాణ ఎం ఎల్ ఎ లు, ఒక్కడూ ఒక్క మాట మాట్లాడటం లేదు.సిరిసిల్లకు పోయే దారిలో ఉన్న నియోజక వర్గాల ఎం ఎల్ ఎ లు కే.లక్ష్మారెడ్డి, నర్సిరెడ్డి కూడా తెలంగాణ పై జరుగుతున్న ఈ ఆంధ్రుల దౌర్జన్యానికి సిగ్గులేకుండా సహకరించారు. వీళ్ళంతా ఆంధ్ర రాజకీయ వర్గాలకు రాజకీయ అధికారం కొరకు అవినీతి డబ్బుకొరకు తమ ఆత్మలను అమ్ముకొని బానిస బతుకులు బతుకుతున్నారు. ఇక మన కాంగ్రెస్ ఎంపిలైతే సమయాన్ని బట్టి ఆకుకు అందకుండా పోకకు చెందకుండా వంకర టింకర మాటలు మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళకు వాళ్ళ ఆధిదేవత సోనియాగాంధీ దర్శనమే అతి దుర్లభం. వీళ్ళకు సోనియాగాంధీ, అహమద్ పటేల్, ఆజాద్ లను ఎదిరించి, ప్రజల ఆకాంక్షలను వారి ఉద్యమ గతి విధులను ఆసరా చేసుకొని తమ రాజకీయ లీవరేజ్ ని ఉపయోగించి పనులు చేయించే దన్ను కానీ, ధైర్యం కానీ లేవు.ఎప్పుడూ, తెలంగాణలో ఈనాటి దుస్థితికి కారణమైన కిరణ్ కుమార్ రెడ్డిని, వాళ్ళ అధినేత కనుసన్నలలో రిమోట్ కంట్రోల్ తో నడిపిస్తున్న ఆజాద్ తో తమ అరకొర మొరలు మొర పెట్టుకొంటుంటారు. మన ఎం పి లకు ముఖ్యమంత్రి ముందు పిసరంత కూడా విలువలేదు. రాష్ట్రంలో ఏ మంచి పనీ చెయ్యడం చేతకాని ముఖ్యమంత్రి వీళ్ళ మాటల్ని ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తుంటాడు. అవసరమైతే వీళ్ళు అడిగినదానికి అడ్డంగా పనిచేస్తుంటాడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఆపడం అయన ప్రధాన మాండేటు మరియు ఎజెండా. ఇక పోతే ఆ దేశముదురు ఆజాద్, వీళ్ళను ముప్పై కుంటల నీళ్ళు తాగించి ముప్పు తిప్పలు పెడుతుంటాడు. అక్కడ చెల్లక ఇక్కడికి వచ్చి అరిగి పోయిన గ్రామఫోను రికార్డుల్లాగా అర్థం లేని, అమలు కాని హామీలు, ఊహాగానాలు వల్లె వేస్తుంటారు. ఎక్కడో దూరంగా సందు దొరికినప్పుడు ఉత్తర కుమార ప్రజ్ఞలు పలుకుతుంటారు. మళ్ళీ కేంద్రానికి వెళ్ళినపుడు, అధిష్టానం అడక్కముందే అందరికంటే ముందు వాళ్ళ పనులు చేసిపెడుతుంటారు. ఎప్పుడూ అధిష్టానం తెలంగాణ విషయంలో చేస్తున్న నిరంతర వాయిదా ప్రక్రియకు అలసిపోకుండా యధాలాపంగా సహాయపడుతుంటారు.

ఇంతమంది మన ప్రజా ప్రతినిధులు ఉండి, ఆంధ్ర ప్రభుత్వము వారి యంత్రాంగము తెలంగాణ ప్రజల మీద చేస్తున్న దౌర్జన్య దమనకాండను ఎదిరించే రాజకీయ శక్తిలేని నిర్వీర్యులై అఘోరిస్తున్నారు. ఈ మలిదశ ఉద్యమంలో, రాష్ట్ర సాధన కొరకు ఉద్యమం,ఎలెక్షన్లు రెంటినీ ఉపయోగించాలనే విధానంలో తెలంగాణ ప్రజలు ఇటు ఉద్యమంలో గాని, అటు ఎలెక్షన్లలో గాని తమ వంతు కర్తవ్యాన్ని ఎంతో ఉదాత్తంగా నిర్వర్తించారు. ఈ పనికి మాలిన ప్రతినిధులు రహీమున్నీసా చూపిన తెగువ, ధైర్యం,సాహసం లో పదో వంతు ప్రదర్శించినా ఈ పాటికి మనం మన తెలంగాణ రాష్ట్రంలో ఉండేవాళ్ళము.

దేశంలోని మరియు రాష్ట్రంలోని సభ్యసమాజం, మీడియా కూడా తెలంగాణ ప్రజల మీద ఆంధ్ర, కేంద్ర ప్రభుత్వాల దమన నీతిని సరిగ్గా గమనించడం లేదు, గమనించినా క్రియాశీలకంగా ప్రతిస్పందించడం లేదు. దేశంలోని ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణులకు తెలంగాణపై ఆంధ్ర ప్రభుత్వం జరుపుతున్ననిరంకుశ ఆధిపత్య ధోరణి ఒక ప్రమాదకర సంకేతమని వీరు గుర్తించాల్సిన అవసరముంది.

రహీమున్నిసా తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఆంధ్ర ప్రభుత్వ దౌర్జన్యాన్ని ఎదుర్కొన్న వీరోచిత సంఘటనను చూసైనా మన ప్రజా ప్రతినిధులు భాద్యతాయుతంగా ప్రవర్తించి తెలంగాణ రాష్ట్రం అతి త్వరలో సాధించే ప్రక్రియలో పాల్గొంటారని ఆశిద్దాం. ఆ సంఘటనలో తీవ్రంగా గాయపడిన రహీమున్నీసా మరియు లలిత త్వరలో కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి తెలంగాణ సాధనలో పాల్గొనాలని భగవంతుని ప్రార్థిద్దాము. ఆమెతో పాటు అసంఖ్యాకంగా సిరిసిల్ల ప్రతిఘటనలో పాల్గొన్న తెలంగాణ ప్రజలకు మన ఉద్యమ అభినందనలు తెలియజేద్దాము.

రహీమున్నిసా వీరోచిత గాధ మన తెలంగాణ రాష్ట్ర పోరాట చరిత్రలో ఒక ధ్రువతారలా వెలుగొందుతుంది.

రహీమున్నిసా పౌరుషం, ఆంధ్ర దమననీతిపై ఒక చెప్పుదెబ్బ
సన్నీ జర్నలిస్ట్..."

రాయల తెలంగాణ అవసరమా...?

రాయల తెలంగాణ అవసరమా...?
**********************
ఇన్ని రోజులుగా తెల౦గాణ ప్రజలు ఎన్నో రకాల పోరటాలు చేస్తు, తెల౦గాణ రాష్ట్ర సాధనే పరమావదిగా పోరు కోనసాగిస్తున్నారు. ఇన్నాళ్లు నీమ్మకు నిరేత్తిన్నాట్లుగా ఉన్న కా౦గ్రేస్ ఇప్పుడు ఆకస్మత్తుగా రాయలతెల౦
గాణ అ౦టు రాయలసీమ ప్రా౦త౦ లోని కర్నూలు, అన౦తపూర్,కడప జిల్లాలను కలిపి రాయలతెల౦గాణ ఇవ్వలా౦టు కొత్త రాగన్ని ..... క్రొ౦గోత్త పల్లవిని అలపి౦చట౦ అనుమాస్పద౦గా ఉ౦ది.
దాద
ాపు 800 మ౦ది తెల౦గాణ వాదులు తమ ప్రాణలను తృణప్రాయ౦గా కేవల౦ పది జిల్లాల తెల౦గాణ కోరకె కాని ఈ రాయలతెల౦గాణను కోరకు కాదు.నేడు ప్రతి తెల౦గాణవాది హైద్రాబాద్ తో ఉన్న పది జిల్లాల తెల౦గాణ నే కోరుకు౦టారు కాని, తెల౦గాణకు తోకను కోరుకొరు. ఆ౦ధ్రప్రదేశ్ ఏర్పాడనప్పుడు ఉన్న తెల౦గాణను, ఆ౦ధ్రప్రదేశ్ ఏర్పాడినప్పుడు కలిపిన తెల౦గాణను కోరుకు౦టారు. మా 10 జిల్లాల మాతెల౦గాణను యధతద౦గా మాకు రాష్ట్ర ౦గా ఇవ్వాలి.
కా౦గ్రేస్ పార్టి తెల౦గాణ సమస్యను ఇ౦కా సాగదీయటానికి ...రాయల తెల౦గాణ అనె సాకుతో కాల౦ వెళ్లదీయటానికి ప్రజలలో చెర్చకు లేపి తమ కాలాన్ని ...తమ పబ్బ౦ గడుపుకోనాలని చూస్తు౦ది.


సన్నీ జర్నలిస్ట్..."

బతుకమ్మ....."

బతుకమ్మ.. కోటి రతనాల వీణలో అపురూపమైన రత్నం! పసుపు పచ్చని తంగేడులు.. ఎర్రని బంతి
పూలు.. గుమ్మడిపువ్వు.. తీగ మల్లె.. గులాబి.. ఉప్పు పువ్వు,
మంకన పువ్వు, ఛెత్రి పువ్వు.. పోక బంతి, కనకాంబరాలు.. గోరెంకపూలు, సలిమల్లె.. అన్ని పూలల్లో ఒదిగిపోయే గును
గు పువ్వు.. పువ్వులేకాదు.. నవ్వుల కలయిక!
ఇది బతుకుల కలయిక! కులం లేదు.. మతం లేదు.. తారతమ్యాలసలేలేవు..! మన అమ్మలు.. మన అక్కలు.. మన చెల్లెళ్లు.. మన అత్తలు.. పట్టుపీతాంబరాలు కట్టుకుని.. కదులుతుంటే.. గౌరమ్మే మన నట్టింట నడుస్తున్నట్టు..!లంగాఓణీల్లో కన్నె పిల్లలు ఉన్నంతలో ముస్తాబై.. ఇంతెత్తు బతుకుమ్మను మలిచి వీధుల్లో సాగుతుంటే.. ఎంత శోభ!
బతుకమ్మలను చేర్చి.. చుట్టూ చేరి.. కష్టాలు, కన్నీళ్లు మర్చి.. చప్పట్లే తాళాలుగా మధురమైన గొంతులు ఉయ్యాల పాటలు పాడుతుంటే.. ఓహ్.. ఇది కాదా.. శ్రమైక జీవన సౌందర్యం! ఇది తెలంగాణ సొత్తు. ఇది తెలంగాణకే సొత్తు! ఓ నిలువెత్తు బతుకు పండుగ..తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక! అపురూపమైన సంబురం! తెలంగాణ అమ్మలకు.. ఆడపడుచులకు..
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
సన్నీ జర్నలిస్ట్..."

జార్జిరెడ్డి...."



జార్జిరెడ్డి ఎవరు? ఉస్మానియా క్యాంపస్‌లో హత్యకు గురైన యువకుడు. అదీ 40 ఏళ్ల కిందట. కాని నేటికీ అతడి ప్రగతిశీల ఉద్యమ పాదముద్రలు చైతన్యస్ఫోరకంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి. కాలం ఒక రోడ్డురోలర్. ఆ కాలచక్రం కింద నలిగి ఎవరైనా నామరూపాల్లేకుండా పోవాల
్సిందే!

అణచివేయలేనంత అపారమైన ప్రతిభ ఉంటేనే- చరిత్రపుటల్లో చోటు దక్కుతుంది. నాలుగు దశాబ్దాలయినా ఇంకా జార్జి సిద్ధాంతపరంగా ఉద్యమాల రూపంలో బతికి ఉన్నాడంటే సామాన్య విషయం కాదు. జార్జిరెడ్డి కేవలం ఓ ఉద్యమ భావజాల యువనేత మాత్రమే కాడు; ‘ఇజం’ ఏదైనా, పోరుబాట ఎలాంటిదైనా, నాయకుడెవరైనా- అనుసరించదగ్గ నాయకత్వ వ్యక్తిత్వం ఉన్నవాడు.

భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి సరిగ్గా ఏడునెలల ముందు జన్మించాడు జార్జి- 1947 జనవరి 15న. లీలా వర్గీస్, రఘునాథరెడ్డి దంపతులకు నాల్గవ సంతానం! పుట్టింది కేరళలోని పాలక్కాడ్. తల్లి మలయాళీ. ఉపాధ్యాయురాలు. తండ్రిది చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం రొంపిచర్ల గ్రామం. ఆయన ఉద్యోగరీత్యా అనేక ఊర్లు తిరిగేవారు. జార్జిరెడ్డి అన్నయ్య కారల్‌రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్.

చిన్నప్పటినుంచి జార్జిరెడ్డి పుస్తకాల పురుగు. చదువులో ఫస్ట్. నిజాం కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసి ఆపై ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో చేరాడు. అప్పటికే సాంఘిక చైతన్యంతో సమకాలీన సమాజంలోని విషాదాల్ని- ఒకరు మరొకర్ని దోపిడీ చేసే వర్గదృక్కోణాన్ని అవలోకనం చేసుకుంటూ ఉన్నాడు. వామపక్షతత్వ అంశాల్ని, మార్క్సిస్ట్ ఆలోచనల్ని నీలం రామచంద్రయ్య మాస్టారి దగ్గర మరింత తెలుసుకున్నాడు జార్జిరెడ్డి.

జార్జి ఆలోచనలు పదును తేలాయి. తాను పుట్టింది తన కోసం కాదని పీడిత తాడిత లోకం కోసమని తెలిసొచ్చింది. ఎమ్మెస్సీలో ఉండగా విద్యార్థుల సమస్యల్ని అర్థం చేసుకోవడం, వాటికై పోరాడటం సహజంగానే జరిగిపోయేది. ఓసారి క్యాంపస్‌లో చిన్న గొడవ జరగడంతో జార్జిరెడ్డిని ఏడాదిపాటు క్లాసులకు రాకుండా నిషేధం విధిస్తూ ‘రస్టికేట్’ చేశారు ప్రిన్సిపాల్.

మరొకరెవరైనా అయితే - క్లాసులకు వెళ్లలేని ఆ ఏడాదిపాటూ అల్లరిచిల్లరగా తిరిగేవారేమో, నిరాశతో గడిపేవారేమో! కాని జార్జిరెడ్డికి ఆ సంవత్సరం బంగారంలాంటి కాలం. ఆ ఒక్క ఏడాదిలో ఎన్ని పుస్తకాలు చదివాడో అంతులేదు. అప్పటికే ఘనీభవించిన జ్ఞానమూలమైన పుస్తకమంటే పిచ్చిప్రాణం జార్జికి. తన సబ్జెక్టులయిన భౌతిక, గణిత శాస్త్ర ప్రాథమిక సూత్రాల్ని మరింత అధ్యయనం చేశాడు. మార్కోవ్ గణితశాస్త్ర పాఠ్యపుస్తకాల లెక్కల్ని ఆమూలాగ్రం సాల్వ్ చేసేవాడు. అంతేకాదు, చుట్టూ ఎప్పుడూ పది పదిహేనుమంది విద్యార్థులు. వారికి ఆయా గణితశాస్త్ర సమస్యల్ని ఇట్టే విడమరచి చెప్పేవాడు.

బెర్క్‌లీ ఫిజిక్స్ పుస్తకంపై సవివరమైన నోట్స్ తయారు చేసుకున్నాడు. నోమ్ చామ్స్కీ, ‘ఎట్ వార్ విత్ ఆసియా’, ఫ్రెడరిక్ హెగెల్ ‘సైన్స్ ఆఫ్ లాజిక్’, జేమ్స్ జాల్ ‘ది అనార్కిస్ట్’, అలెక్స్ హేలీ ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కమ్ ఎక్స్’, రెజిదిబ్రె ‘రివల్యూషన్ ఇన్ రివల్యూషన్’, ఫ్రాంజ్ ఫెనన్ ‘రెచ్‌డ్ ఆఫ్ ది ఎర్త్’ లాంటి అనేకానేక పుస్తకాల్ని అధ్యయనం చేశాడు. పాతికేళ్లు కూడా లేని ఒక కుర్రాడు అన్నేసి గంటలపాటు ఇన్నేసి పుస్తకాలు చదవడం ఆశ్చర్యకరమైన విషయం.

లాటిన్ అమెరికా దేశాల్లో ప్రజల విముక్తి కోసం విప్లవ సాయుధ గెరిల్లా పోరాటం సాగించిన చే గువేరా - జార్జిని అమితంగా ఆకర్షించాడు. చే రచించిన ‘గెరిల్లా వార్‌ఫేర్’, ‘ఆన్ రివల్యూషన్’. ‘వెన్ సెరిమోస్, ‘బొవీలియన్ డైరీ’ లాంటి గ్రంథాలు జార్జిని విశేషంగా ప్రభావితం చేశాయి.
అంతేకాదు, ట్రాట్స్కీ, ప్లేటో, సిగ్మండ్ ఫ్రాయిడ్ రచనల్ని సైతం అక్షరమక్షరమూ ఔపోసన పట్టాడు జార్జిరెడ్డి. మార్క్సిజాన్ని, ఆ తత్త్వంతో మానవ సమాజ పరిణామాన్ని, పీడన సాగే విధానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాడు.
ఏడాది అజ్ఞాతవాసం లాంటి ‘రస్టికేషన్’ ముగిసింది. ఎమ్మెస్సీ పరీక్షలు జరిగాయి. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాడు. గోల్డ్‌మెడల్ పొందాడు.

ఓ పక్క సబ్జెక్ట్, మరోపక్క గ్రంథపఠనం- అసలైన విద్యను అందుకున్నాడన్నమాట.
విస్తృత అధ్యయనం వల్ల జార్జిరెడ్డిలో మార్క్సిస్టు సైద్ధాంతిక విశ్వాసాలు, విప్లవభావాలు, స్పష్టమైన రూపు కట్టాయి. శాస్త్రీయ సోషలిస్ట్ సిద్ధాంతాల అన్వేషణ అతనిలో ప్రారంభమైంది. ఆంధ్రదేశంలోనే కాదు, దేశంలోనూ, ప్రపంచంలోనూ 1960 దశకంలో జరిగిన అనేకానేక పరిణామాలు జార్జిలోని ప్రశ్నించే తత్వాన్ని తట్టిలేపాయి. ఆలోచనను మరింత చురకత్తిని చేశాయి.
1967 నాటి పశ్చిమబెంగాల్ నక్సల్బరీ పోరాటం, తెలంగాణలోని అశాంతి, నిరుద్యోగం, శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటం, వియత్నాం యుద్ధం... అన్నీ జార్జిరెడ్డిని అవ్యక్తపుటూహలతో కుదిపేసేవి.

1968 మేలో ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డిగిలె ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షలాది మంది కార్మికులు ఏకమై చేసిన విద్యార్థి ఉద్యమం కావచ్చు; దక్షిణాఫ్రికాలో సొవెటో ప్రాంతంలో చెలరేగిన విద్యార్థి ఉద్యమం కావచ్చు; వర్ణవివక్షకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన పోరాటం కావచ్చు; అమెరికాలో 1966లో ఆఫ్రో అమెరికన్ విప్లవ వామపక్షవాదులు తీసుకొచ్చిన బ్లాక్ పాంథర్స్ ఉద్యమం కావచ్చు; అమెరికా సామ్రాజ్యవాదంపై ఎక్కుపెట్టిన వియత్నాం ప్రజాపోరాటాలు కావచ్చు... అన్నీ జార్జిరెడ్డిపై తీవ్ర ప్రభావం చూపాయి.

ఒక మార్క్స్, ఒక హెగెల్, ఒక చేగువేరా, ఒక మిఖాయిల్ బుకునిన్ అందించిన దార్శనికతతో ఆయా విప్లవ పోరాటాల్ని సశాస్త్రీయ హేతువాద దృష్టితో అవలోకనం చేసుకున్నాడు. ప్రపంచమేమిటో, బలవంతులు బలహీనులను దోపిడీ చేసే ప్రక్రియ ఏమిటో, లోకపుటన్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలూ, దౌర్జన్యాలూ ఏమిటో అర్థమైంది జార్జిరెడ్డికి. వెరసి ఒక ఆకర్షణీయమైన, ఆదర్శనీయమైన వ్యక్తిత్వం సంతరించుకుంది జార్జిలో! దరిమిలా జార్జిరెడ్డి క్యాంపస్‌లో ఓ ‘హీరో’అయ్యాడు.

అయిదడుగుల ఆరంగుళాల ఎత్తు, గోధుమవన్నె రంగు, కొద్దిగా గడ్డం, సన్నటిమీసం, దృఢకాయం, ఎడమపాపిట, పొట్టిచేతులతో కూడిన బుష్‌షర్ట్‌తో అప్పుడప్పుడు; ఆపై వెడల్పాటి జేబులు, పొడుగు చేతుల ఆలివ్‌గ్రీన్ చొక్కా, కాటన్ జీన్స్‌తో నడుస్తుంటే జార్జిరెడ్డి ఆత్మవిశ్వాసం నడుస్తున్నట్లుగా ఉండేది. చెదరని చిరునవ్వు, కాంతిపుంజాల్లా కళ్లు, రోజూ గంటపాటు జిమ్‌లో బస్కీలు, గుంజీలు, బ్యాక్ బెండింగ్, పొత్తికడుపు వ్యాయామాలు, మల్లయుద్ధం ప్రాక్టీస్ చేసేవాడు. స్వతహాగా జార్జి బాక్సర్, బ్లేడ్ ఫైటర్.

అడిగినవారికీ అడగనివారికీ సహాయం చేసేవాడు జార్జిరెడ్డి. ఫీజులు, మెస్సులు, పుస్తకాలు, అణచివేతలు, అవమానాలు, దుఃఖాలు, ఆత్మన్యూనతలు... ఇలా విద్యార్థుల్లో ఎలాంటి కష్టాలున్నా వెంటనే హాజరయ్యేవాడు. క్యాంపస్ వాతావరణంపై అనవసర పట్టు సాధించాలని ప్రయత్నించే స్వార్థపు శక్తులతో పోరాడేవాడు. ఆ క్రమంలో అనేకసార్లు భౌతికంగా దాడులు జరిగాయి జార్జిపై. అందుకే ఎప్పుడూ తనతోపాటు ఆరంగుళాల కత్తి సిద్ధంగా ఉండేది.

ఇదంతా ఒక ఎత్తు, విద్యార్థులలో సాంఘిక స్పృహ, ప్రగతిశీల భావాల్ని పెంచేందుకు జార్జి చేసిన కృషి ఒకటీ ఒక ఎత్తు. సైన్స్ కాలేజీకి, ఆస్ట్రానమీ డిపార్ట్‌మెంటుకీ ఆనుకొని ఉన్న క్యాంటీన్ వారందరికీ అడ్డా. క్యాంటీన్‌ని ఆనుకుని ఉన్న వేపచెట్టు, దానికింద నాలుగైదు బండరాళ్లు, వాటిపై కూచొని కబురులు... రాత్రిళ్లు, అందునా వర్షం కురుస్తున్న రాత్రిళ్లు, వెన్నెల రాత్రిళ్లు... నలభై ఏభై మంది చుట్టూ... మధ్యలో జార్జి...

అంతగా రాని తెలుగులో, హైదరాబాదీ హిందీలో, చక్కటి ఇంగ్లిష్‌లో జార్జిరెడ్డి ప్రసంగాల్లాంటి ప్రసారాలు... బండక్యాంటీన్ దగ్గర.. స్పష్టమైన మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథంతో పాలస్తీనా సమస్య, గ్వాటెమాలా సంఘటనలు, ఫోకోసిద్ధాంతం, గెరిల్లా పోరాటం, ఆఫ్రికా ప్రజల విముక్తి ఉద్యమాలు.. ఇలా ఎన్నెన్ని అంశాలపై జార్జిరెడ్డి ఉపన్యాస ధార సాగేదో అంతులేదు.

కేవలం భావజాలమే కాదు, ఆచరణ కూడా జార్జిరెడ్డిలో కనిపించే తత్త్వం. స్లిప్పర్లే వేసుకునేవాడు. బట్టలు ఎక్కువ ఉండేవి కావు. రెండే రెండు జతలు. కొనుక్కోలేక కాదు. కొనుక్కోవడానికి ఆస్కారం లేని లక్షలాది పేదల్లా తానూ బతకాలని! ఒక పూటే తినేవాడు. ఆకలితో మలమల్లాడుతున్న నిర్భాగ్య అన్నార్తుల ఆకలి కేకలేంటో తానూ అనుభవించాలని! కాగితమ్మీద రాస్తే... మొత్తమంతా ఎక్కడా ఖాళీలేకుండా రాసేవాడు. దేన్నయినా మితంగా, పొదుపుగా ఉపయోగించేవాడు. నిర్లక్ష్యం, అహంకారం అతగాడికి తెలీవ్. ఎప్పుడూ సిటీబస్సుల్లోనే తిరిగేవాడు.

అతని మాటల్లో తీవ్రత, నిజాయతీ, స్పష్టత ఉండేవి. తనకు వచ్చే స్కాలర్‌షిప్ డబ్బుల్ని ఏ ఆధారం లేని ఓ బాల్యమిత్రుడికి వ్యాపారం పెట్టుకోమని ఇచ్చేశాడు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృష్టిని, విషయ పరిజ్ఞానాన్ని పెంచేందుకు అనేకానేక సెమినార్లు నిర్వహించాడు. రిక్షా కార్మికులతో కలసి భోజనం చేసేవాడు.

అయితే అదే సమయంలో క్యాంపస్‌లోని సమస్యలపై పోరాడేవాడు. ఫలితంగా శత్రువులు పెరిగారు. సోషలిస్టు భావాల్ని, ఆద ర్శాల్ని వ్యాప్తి చెయ్యాలన్న లక్ష్యంతో స్టడీసర్కిల్‌ను ఏర్పాటు చేశాడు. జార్జిరెడ్డి అప్రతిహతంగా సాగిస్తున్న ఉద్యమబాటను నిరోధించాలన్న కుట్రతో 1972 ఫిబ్రవరిలో జార్జిపై డీడీ కాలనీలోని అతని ఇంటి సమీపంలో దాడి జరిగింది.

గాయాలపాలయ్యాడు. ఒంటరిగా తిరగడం మంచిది కాదని మిత్రులు సూచించారు. ‘చావు అంత తేలికగా తన దగ్గరకు రాదని’ నవ్వుతూ అనేవాడు. అలా అన్న వారానికే- ఏప్రిల్ 14న సాయంత్రం ఇంజినీరింగ్ కాలేజీ భవనం దగ్గర ప్రత్యర్థుల చేతిలో హతుడయ్యాడు.
తాను మరణించి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి పునాది అయ్యాడు. విద్యార్థి నాయకుడు- జ్ఞానం, ప్రేమ, మానవతల విషయంలో ఎలా ఉండాలో నేర్పాడు.

నా ఊరు..."


నా ఊరు..."

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ కళలతో వన్నె తీసుకు వచ్చిన మహానుభావులకు జన్మనిచ్చిన గ్రామం హన్మాజీపేట. హన్మాజీపేట లో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కవి, ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. సి.నారాయన రెడ్డి జన్మించిన గ్రామం హన్మాజీపేట్. ఎవరికీ అవగాహనా లేని ఒగ్గు కథకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన మరో కళకారుడు మిద్దె రాములు జన్మించింది హన్మాజీపేట్ లోనే. దక్ష
ణ కాశిగా ప్రసిద్ద శైవ క్షేత్రం వేములవాడకు 8 కి.మీ దూరంలో ఉన్న హన్మాజీపేట కవులతో పాటు విద్య వేత్తలకు నిలయం. గ్రామంలో జన్మించిన చాల మంది ప్రభుత్వ అధికారులుగా ఇంజనీర్లుగా.డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా, జర్నలిస్ట్ లుగా, ప్రోఫెసర్లుగా వెలుగొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రము లోనే ప్రతిస్టాత్మకంగా ఉద్యమ కేంద్రంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్న ప్రో:మల్లేశం కూడా ఈ గ్రామంలోనే జన్మించినారు. గ్రామం మౌలిక సదుపాయల విషయం లో జిల్లా స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గ్రామంలో ఎక్కడ కానరాని మట్టి రోడ్లు గ్రామం లోని వీధి వీధికి సిమెంట్ రోడ్ల నిర్మాణం, 2 ఎకరాల విశాల స్థలం లో స్కూల్ నిర్మాణం డా.సి.నా.రే గారి సహకారంతో నిర్మించబడింది.ఇంకా ఎన్నో సదుపాయాలు కల్గిన గ్రామం హన్మాజీపేట.
సన్నీ జర్నలిస్ట్...." (హన్మాజీపేట)