Sunday, 28 April 2013

Hanmajipeta (నా ఊరు...హన్మాజీపేట ) 2


నా ఊరు..."
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ కళలతో వన్నె తీసుకు వచ్చిన మహానుభావులకు జన్మనిచ్చిన గ్రామం హన్మాజీపేట. హన్మాజీపేట లో పుట్టి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కవి, ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా.
సి.నారాయన రెడ్డి జన్మించిన గ్రామం హన్మాజీపేట.
 ఎవరికీ అవగాహనా లేని ఒగ్గు కథకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన మరో కళకారుడు మిద్దె రాములు జన్మించింది హన్మాజీపేట లోనే.
దక్ష ణ కాశిగా ప్రసిద్ద శైవ క్షేత్రం వేములవాడకు 8 కి.మీ దూరంలో ఉన్న హన్మాజీపేట కవులతో పాటు విద్య వేత్తలకు నిలయం. గ్రామంలో జన్మించిన చాల మంది ప్రభుత్వ అధికారులుగా,రాజకీయ నాయకులుగా, ఇంజనీర్లుగా.డాక్టర్లుగా, లాయర్లుగా,  ఉపాధ్యాయులుగా, జర్నలిస్ట్ లుగా, ప్రోఫెసర్లుగా వెలుగొందుతున్నారు. 
ప్రస్తుతం రాష్ట్రము లోనే ప్రతిస్టాత్మక ఉద్యమ కేంద్రంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్న ప్రో:మల్లేశం కూడా ఈ గ్రామంలోనే జన్మించినారు.గ్రామం మౌలిక సదుపాయల విషయం లో జిల్లా స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రెండు వాగుల నడుమ నా ఊరు చక్కని సోయగాన్ని అలుముకుంది. పచ్చని పొలాల పైర గాలులు స్వాగతం పలుకుతుంటే, ప్రకృతి రమణియతలు నా ఊరు అందాలను వివరిస్తాయి. ఉరిలో ప్రవేశించగానే  ఎక్కడ కానరాని  మట్టి రోడ్లు హన్మాజీపేట అభివృద్దిని చాటుతాయి.మానేరు వాగుపై నిర్మించిన బ్రిడ్జి సి.నా. రే గారికి మా ఊరి మీదా అభిమానానికి నిదర్శనం. 2 ఎకరాల విశాల స్థలం లో స్కూల్ నిర్మాణం డా.సి.నా.రే గారి సహకారంతో జిల్లా స్థాయిలో ఉత్తమ భవనంగా  నిర్మించబడితే . అందులోని  విద్య కుసుమాలు రాష్ట్ర స్థాయిలో పరిమలిస్తున్నాయి. సేవాతత్పరత లోను మా యువ కెరటాలు ఆదర్శంగా  నిలుస్తున్నారు.  విదేశాల్లో స్థిరపడిన చాల మంది ఊరి కోసం పడే తపన, చేపట్టే కార్యక్రమాల కోసం తమ వంతు చేయూతను ఇవ్వడం కోసం ప్రయత్నించడం ఇందుకు నిదర్శనం. గ్రామా అభివృద్దిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు నిర్మల్ గ్రామీణ  పురస్కారాన్ని ప్రకటించింది.   ఇంకా ఎన్నో సదుపాయాలు కల్గిన గ్రామం హన్మాజీపేట. ఇంత మంది మేధావులకు జన్మనిచ్చిన హన్మాజీపేట ఒడిలో నేను ఒదగడం.  అక్కడి నుంచి ఎదగడం నేను చేసుకున్న అదృష్టం
-సన్నీ జర్నలిస్ట్...." (హన్మాజీపేట) 


Great Journalist Kishore Nayak

జర్నలిజం గురుంచి జర్నలిస్టుల గురుంచి, జానపాడు అరుగుల మీద కూర్చునే వాళ్ళ దగ్గర నుంచి Supreme Court జడ్జిల దాకా అందరూ చెప్పే మాట .."విలువలు పడిపోతున్నాయి..వ్యాపారం చేస్తున్నారు.. ఎక్కడా బతకలేక ఇక్కడ కొచ్చి అడ్డదిడ్డంగా దోచుకుంటున్నారు" అని.... కానీ "కిషోర్ నాయక్ " లాంటి కలాలు జనం గళాలకి అక్షర రూపం ఇస్తూ ఉండబట్టే ఇంకా "పాత్రికేయ" వృత్తికి విలువ తరగకుండా వుంది....
అవినీతి కలాలతో ,అక్రమ కెమెరాలతో సమాజం మీద అసుద్దం గక్కుతూ రాజ్యాంగ వ్యవస్థలని చెరబడుతున్న నేటి కాలంలోనే... వ్యక్తిగత గుర్తింపు కన్నా సామాజిక బాద్యత,సామాన్యుని రక్షణ ముఖ్యమని భావించే ఎందఱో "నాయక్" లు కలాలతో,కెమేరాలతో మన చుట్టూ రక్షణగా నిలవబట్టే ఈ మాత్రం స్వేఛ్చ,స్వాతంత్ర్యం అన్నా మనకి మిగిలాయి...పాత్రికేయ వృత్తిని దివిటీలుగా వెలిగిస్తున్న "నాయక్"లందరికి వందనా
లు..

Wednesday, 20 March 2013

అజ్ఞానం...

ఎక్కడ? అ-జ్ఞానం!
పెద్దల ప్రేరణతో జరిగే వివాహ ఒప్పందానికి, ఉంగరాల మార్పిడి ప్రధానాంశం
వలపు స్పందనతో జరిగే జీవన భాగస్వామ్యానికి రిజిస్టర్డ్ పెళ్ళి మరో అంశం
అంశాల సారాంశం ఒకటయినా, అంతరంగాలు స్థానభ్రంశం చెందుతున్నాయి
వజ్రాలు పొదిగిన ఉంగరాల పటాటోపం, చట్టబద్ధతను కలిగిన సూత్రాల ప్రతాపం
చాలా జంటల విషయంలో వైవాహిక ఫలితాలు గుర్తింపును కోల్పోతున్నాయి
విడాకుల సమరభేరిలో భారీగా తమ భవిష్యత్ విలువలను కోల్పోతున్నారు
స్పందనకు బంధనకు మధ్యన "ప్రణయం",జీవనయానంలో కోల్పోయింది జ్ఞానం!!

సన్నీ జర్నలిస్ట్..

నిజమేనా.."

అసెంబ్లీ సమావేశాలలో 294 మంది ఎమ్మెల్యే లలో ఎవరు మాట్లాడిన తోటి ఎమ్మెల్యే లు ముందు ఉన్న బల్లను కొట్టి అబినందిస్తుంటారు.కాని ఒక్క ఎమ్మెల్యే ఎన్ని వాస్తవాలు మాట్లాడిన, ఎంత అర్ధవంతమైన ప్రసంగం చేసిన, ఎన్ని సమస్యలు ప్రభుత్వానికి ఎత్తి చూపించిన, ఒక్క తోటి ఎమ్మెల్యే ఆయనను అభినందించే ప్రయత్నం చేయలేదు ఆయనే లోక్ సత్తా అధ్యక్షుడు జయ ప్రకాష్ నారాయణ.. గురువారం జరిగిన హౌస్ దీనిని గమనించవచ్చు దీనిని ఎ విధంగా చూడాలి...? మీరే మీ కామెంట్ రాయండి..."
సన్నీ జర్నలిస్ట్...."

ఇది మన భారతం..."

ఆపదలో ఉన్నప్పుడు అంబులెన్సుకు కాల్ చేస్తం. ఆకలేస్తే పిజ్జా హాట్‌కి ఫోన్‌ చేస్తం. అంబులెన్స్‌ కంటే ముందే పిజ్జా ఇంటికి చేరుతుంది. ఎడ్యుకేషన్ లోన్‌ కంటే కార్‌ లోన్‌ త్వరగా దొరుకుతుంది. నీళ్లు లేని చోట కూడా నెట్‌వర్క్‌ ఉంటుంది. సిమ్‌కార్డులు ఫ్రీ. ఉల్లిగడ్డలు చాలా కాస్ట్‌ లీ. ఒలింపిక్స్‌ విజేతకు ప్రభుత్వం కోట్ల రూపాయలిస్తుంది. బార్డర్‌ లో సైనికుడు దేశం కోసం ప్రాణాలర్పిస్తే.. అతడి కుటుంబానికి లక్ష రూపాయాలిస్తుంది. గవర్నమెంట్‌ ఆస్పత్రులుంటాయి. ఎంతంటే అంత డబ్బు ఇస్తాం.. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోండి అంటుంది. ఆ డబ్బు ఎదరిది..? మన డబ్బే మనకే ఇచ్చి పెద్ద ఫోజు. గ్రేట్‌ గవర్నమెంట్‌.
-సన్ని జర్నలిస్ట్

సి.బి.ఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ బదిలీ..."

సి.బి.ఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ బదిలీ..."

గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాలను..వాటిని శాసిస్తున్న వ్యక్తులను...మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తనదైన శైలి లో గడగడ లాడించిన సి.బి.ఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ త్వరలో రాష్ట్రాన్ని వదలనున్నారా..? అవును అనే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. త్వరలో లక్ష్మి తన కేంద్ర కార్యాలయం ఢిల్లీ వేల్లబోతున్నట్లు సమాచారం. వాస్తవానికి లక్ష్మి నారాయణ మహారాష్ట్ర కెడార్ కి చెందిన అధికారి 7 సంవత్సరాల క్రితం డెప్యుటేషన్ పై ఆంధ్ర ప్రదేశ్ కి వచ్చారు. ప్రస్తుతం హై కోర్ట్ ఆదేశాల మేరకు లక్ష్మి నారాయణ జగన్ అక్రమ ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు లో మర్చి నెలాఖరులో సి.బి.ఐ చివరి చార్జి షిట్ దాఖలు చేసే అవకశం ఉంది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ముక్కుసూటిగా వ్యవహరించే లక్ష్మి నారాయణ బదిలీ రాజకీయంగా చర్చనీయ అంశం గా మారింది..గతం లో కూడా తనపై వ్యక్తి గత ఆరోపణలు వచ్చిన దైర్యంగా ఎదురుకొన్న లక్ష్మి నిక్కర్సైన పోలీస్ అధికారిగా పేరొందాడు...మరి ఈ బదిలి తర్వాత రాష్ట్రంలో పరిణామాలు ఎ విధంగా మారుతాయో వేచి చూడాలి....!
-సన్నీ జర్నలిస్ట్...

మీడియాలో వెలుగు చూడని మా’రాజు’ సేవ...."


మీడియాలో వెలుగు చూడని మా’రాజు’ సేవ


గోకుల్‌చాట్‌ పేలుళ్లలో క్షతగాత్రులను రక్షించేందుకు అసమాన తెగువ
తెలంగాణ జర్నలిస్టు సేవకు గుర్తింపునివ్వని సీమాంధ్ర మీడియా
కొత్తతరం జర్నలిస్టులకు కరీంనగర్‌ బిడ్డ అల్లూరి సీతారామారాజు ఆదర్శ

ఎవరెటు పోతే మాకేంటి స్కోరింగ్‌ కొట్టామా? లేదా? అన్నది ప్రస్తుత మీడియా ప్రతినిధుల ధోరణి. ఎలక్ట్రానిక్‌ మీడియా విస్తృతి పుణ్యమా అని పాత్రికేయులు మానవీయ విలువలకు 90 శాతం తిలోదకాలిచ్చారన్న వాదనతో అందరూ ఏకీభవించాల్సిందే. ఇందుకు నిదర్శనలెన్నో ప్రతినిత్యం మనం చూస్తూనే ఉన్నాం. రోడ్డు ప్రమాదంలోనో, ప్రకృతి వైపరీత్యాల్లోనో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిని వివరాల కోసం గుచ్చిగుచ్చి ప్రశ్నించడం తెలుగు మీడియా ప్రతినిధులకే చెల్లింది. ఖూనీకోర్లను, కబ్జా రాయుళ్ల ఇంటర్వ్యూలు ప్రసారం చేయడం, వారికి లేని హైప్‌ ఇవ్వడం, పొద్దంతా చూపించిన దాన్నే చూపించి ప్రేక్షకులను విసిగించడం మన ఎలక్ట్రానిక్‌ మీడియాకే చెల్లింది. వార్తల ప్రసారంలోనూ ఎవరికి వారు గిరి గీసుకొని ఆ గీతలకు లోబడే ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్న తరుణంలోనూ ఈ ప్రాంత జర్నలిస్టులకు సీమాంధ్ర పెత్తందారి మీడియాలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. అమానవీయ జర్నలిజంలో మానవత్వం పరిమళించేలా… బాంబు దాడిలో నెత్తుటి ముద్దల్లా కొన ఊపిరితో ఉన్న శరీరాలను స్వయంగా ఆస్పత్రికి తరలించినా కనీసం ఆ దృశ్యాలను కూడా సదరు మీడియా ప్రసారం చేయలేదంటే వారి ఆధిపత్య ధోరణి ఎంతో అర్థం చేసుకోవచ్చు. అదే మీడియా తమ సామాజిక వర్గానికి చెందిన జర్నలిస్టులు ఏ చిన్నపని చేసినా ఏదో ఘనకార్యం చేసినట్టు ప్రచారం కల్పించుకుంటోంది. కానీ తెలంగాణకు చెందిన ఓ జర్నలిస్టు హైదరాబాద్‌ నడిబొడ్డున జరిగిన కోఠీ సమీపంలోని గోకుల్‌చాట్‌లో బాంబు పేలుళ్లలో గాయపడ్డ వారిని స్వయంగా ఆస్పత్రికి తరలించినా ఒక్క బులిటెన్‌లోనూ ఆ దృశ్యాలను ప్రసారం చేయలేదు. ఓ పక్క బాంబులు పేలుతున్నా ప్రాణాలకు తెగించి క్షతగాత్రులను కాపాడాలని ఆయన చేసిన ప్రయత్నాలను అభినందించనూ లేను. బాంబు పేలుళ్ల ధాటికి శరీరంలో అవయవాలు తెగిపడి, కొన ఊపిరితో రక్తమోడుతున్న వారిని చూసి తమకూ ఆ పరిస్థితి రాకూడదని సమీపంలో ఉన్నవారంతా అక్కడ్నుంచి పారిపోతున్న తరుణంలో అంకితభావంతో వృత్తి ధర్మాన్ని, మానవత్వాన్ని చాటుకున్న జర్నలిస్టు తెగింపును కనీసం బాహ్య ప్రపంచానికి తెలపడానికి ఇష్టపడలేదు మీడియాలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఆ సంస్థ. మీడియా అంటే ఏహ్యభావం, మీడియా ప్రతినిధులంటే భయం పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వారికి కనీసం ప్రాచుర్యం కల్పించకపోవడాన్ని ఏమనాలి. ఈ మధ్య మీడియాలో పెడ ధోరణులు మరింతగా పెరిగిపోయాయి. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా బ్రేకింగులు వేస్తున్నాయి. వాటిని క్యాష్‌ చేసుకొని రేటింగులు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ మధ్య కరీంనగర్‌ జిల్లాలో ఓ మహిళ మరోకరితో వివాహేతర సంబంధం నెరుపుతుందని అందరూ కూడి చావబాదుతుంటే మీడియా కళ్లప్పగించుకొని చూసింది. ఎంచక్కా తమ కెమెరాల్లో బంధించి ప్రజలకు అదో వినోదంలా చూపింది. విచక్షణ రహితంగా కొట్టి దెబ్బలకు తాళలేక ఆ మహిళ కొద్ది రోజుల తర్వాత చనిపోయింది. అప్పుడే సదరు మీడియా ప్రతినిధులు రెచ్చిపోయి దాడి చేస్తున్న వారికి కాస్త సర్ధిచెప్పి ఉంటే నిండు ప్రాణాలు దక్కేవి. పలు సందర్భాల్లో వివిధ డిమాండ్లతో సెల్‌ టవర్లు, భవనాలు ఎక్కిన వారిని లైవ్‌లలో చూపించి ఇలాంటి ఘటనలను ప్రేరేపించింది. కొందరు భావోద్వేగానికిలోనై దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఈ చానెళ్ల బరితెగింపే కారణం. అలాంటి పరిస్థితుల్లో ‘గంజాయివనంలో తులసి మొక్క’లా ఓ యువ జర్నలిస్టు చేసిన అసమాన సేవకు ఎంతమాత్రం గుర్తింపు దక్కలేదు. ఇదే పని ఆ మీడియా సంస్థ నిర్వాహకుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చేస్తే ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దినపత్రికలో పతాక శీర్షికన ప్రచురించేది. అన్ని భాషల చానళ్లలోనూ ప్రముఖంగా ప్రసారం చేసేది. మంచిపని చేసే జర్నలిస్టులే కనుమరుగవుతున్న తరుణంలో ఐదున్నరేళ్ల క్రితం (2007 ఆగస్టు 25) హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్‌, లుంబినీ పార్కులో ముష్కరులు బాంబులు పేల్చి చాలా మందిని పొట్టన బెట్టుకున్నారు. పిల్లలతో, స్నేహితులతో సరదాగా పార్కుకు వెళ్లిన వారు, చాట్‌, ఐస్‌ క్రీమ్‌లు తినేందుకు వెళ్లిన అమాయకులు ఆ బాంబుల విస్ఫోటనానికి బలయ్యారు. అదే ప్రమాదంలో వందలాది మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకురాలేదు. వచ్చిన ఒకటి, రెండు అంబులెన్స్‌లు కొందరినే ఆస్పత్రికి తరలించాయి. ఆ సమయంలో వార్త కవరేజీకి వెళ్లిన ఈటీవీ 2 కరస్పాండెంట్‌ సీతారామారాజు అక్కడ తునాతునకలైన దేహాలను చూసి చలించిపోయారు. తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఆపన్నహస్తం కోసం రోదిస్తున్న క్షతగాత్రులను స్వయంగా బయటికి తీసి ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ప్రైవేటు వాహనదారులు ఆయనకు సహకరించకపోతే సిటీ బస్సును ఆపి అందులో క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారికి సత్వరం వైద్యం అందితే ప్రాణాలు దక్కుతాయనే విశ్వాసంతో ప్రమాదాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకుసాగిన సీతారామరాజును ప్రతి మానవతావాది అభినందించి తీరాలి. కానీ ఆయన ఉద్యోగం చేస్తున్న మీడియా సంస్థ మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఇది నిజంగా అమానవీయం. ఒక ప్రాంతం ప్రజల ఆకాంక్షలను నొక్కి పెట్టడమే కాదు, ఆ ప్రాంత జర్నలిస్టుల అసాధారణ స్థాయిలో ఐటమ్స్‌ రిపోర్ట్‌ చేసినా కేవలం వార్త మాత్రమే ప్రసారం చేసి వారి తెగింపును, చొరవను తొక్కి పెట్టాలని చూడటం దారుణం. ఇప్పటికైనా సీమాంధ్ర పెత్తందారుల చేతుల్లో కేంద్రీకృతమైన మీడియా ప్రజల ఆకాంక్షలతో పాటు అసమైన ప్రతిభ చూపిన జర్నలిస్టులను తెగువకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్టు సంఘం ప్రతినిధులు కోరుతున్నారు.

(Muzibur Rahman)