సి.బి.ఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ బదిలీ..."
గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాలను..వాటిని శాసిస్తున్న వ్యక్తులను...మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని తనదైన శైలి లో గడగడ లాడించిన సి.బి.ఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ త్వరలో రాష్ట్రాన్ని వదలనున్నారా..? అవును అనే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. త్వరలో లక్ష్మి తన కేంద్ర కార్యాలయం ఢిల్లీ వేల్లబోతున్నట్లు సమాచారం. వాస్తవానికి లక్ష్మి నారాయణ మహారాష్ట్ర కెడార్ కి చెందిన అధికారి 7 సంవత్సరాల క్రితం డెప్యుటేషన్ పై ఆంధ్ర ప్రదేశ్ కి వచ్చారు. ప్రస్తుతం హై కోర్ట్ ఆదేశాల మేరకు లక్ష్మి నారాయణ జగన్ అక్రమ ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు లో మర్చి నెలాఖరులో సి.బి.ఐ చివరి చార్జి షిట్ దాఖలు చేసే అవకశం ఉంది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ముక్కుసూటిగా వ్యవహరించే లక్ష్మి నారాయణ బదిలీ రాజకీయంగా చర్చనీయ అంశం గా మారింది..గతం లో కూడా తనపై వ్యక్తి గత ఆరోపణలు వచ్చిన దైర్యంగా ఎదురుకొన్న లక్ష్మి నిక్కర్సైన పోలీస్ అధికారిగా పేరొందాడు...మరి ఈ బదిలి తర్వాత రాష్ట్రంలో పరిణామాలు ఎ విధంగా మారుతాయో వేచి చూడాలి....!-సన్నీ జర్నలిస్ట్...

No comments:
Post a Comment