ఎక్కడ? అ-జ్ఞానం!
పెద్దల ప్రేరణతో జరిగే వివాహ ఒప్పందానికి, ఉంగరాల మార్పిడి ప్రధానాంశంవలపు స్పందనతో జరిగే జీవన భాగస్వామ్యానికి రిజిస్టర్డ్ పెళ్ళి మరో అంశం
అంశాల సారాంశం ఒకటయినా, అంతరంగాలు స్థానభ్రంశం చెందుతున్నాయి
వజ్రాలు పొదిగిన ఉంగరాల పటాటోపం, చట్టబద్ధతను కలిగిన సూత్రాల ప్రతాపం
చాలా జంటల విషయంలో వైవాహిక ఫలితాలు గుర్తింపును కోల్పోతున్నాయి
విడాకుల సమరభేరిలో భారీగా తమ భవిష్యత్ విలువలను కోల్పోతున్నారు
స్పందనకు బంధనకు మధ్యన "ప్రణయం",జీవనయానంలో కోల్పోయింది జ్ఞానం!!

No comments:
Post a Comment