Sunday, 28 April 2013

Rani Rudrama In Politics..."


మీడియా ఫీల్డ్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల యాంకర్ రాణి రుద్రమ మీడియాను వదిలి రాజకీయల్లోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాణి రుద్రమ తన సొంత నియోజకవర్గం వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రాణికి నర్సంపేట నుంచి టికెట్ ఇచ్చేందుకు తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నర్సంపేట ఇంచార్జీగా నియమించారు. దాంతో నర్సంపేట నుంచి ఆమె పోటీ చేయడం ఖాయమైపోయినట్లు చెబుతున్నారు. నిజానికి రాణి రుద్రమకు రాజకీయానుభవం లేదు. న్యూస్ యాంకర్‌గా ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. టీవీ9, సాక్షి, ఏబీఎన్, టీన్యూస్ చానళ్లలో పని చేసిన ఆమెకు ఉత్తమ యాంకర్ గా నంది అవార్డు కూడా వచ్చింది. ఏబీఎన్ లో పని చేస్తున్నప్పుడు ఆమె టీన్యూస్ కు వెళ్లింది. పొలిటికల్ ఎంట్రీ కోసమే ఆమె టీ-న్యూస్ కు వెళ్లిందని అందరు భావించారు. టీ-న్యూస్ లో మంచి హోదా, గౌరవం ఇచ్చారు. అయితే టీఆర్ఎస్ నుంచి నర్సంపేట అసెంబ్లీ స్థానం కోసం టికెట్ ఆశించి భంగపడటంతోనే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తన ప్రజెంటేషన్ తో ప్రజల్ని ఆకట్టుకున్న రాణి.. పొలిటికల్లో ఎంత వరకు సక్సెస్ అవుతారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.

1 comment:

  1. meeru ysr cp ennukovadam baagaaledandi.career lo idoka pedda mistake kaavachani maa abhiprayam

    ReplyDelete