వేములవాడ..ఉత్తర
తెలంగాణకే తలమానికం. దక్షిణ కాసి. సాక్ష్యాత్తు పరమ శివుడు కొలువై ఉన్న ఒక
ప్రసిద్ద పుణ్యక్షేత్రం.. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ శైవ
క్షేత్రం గత కొద్ది కాలంగా అపవిత్రతకు చిరునామాగా మారింది.. అసాంఘిక
కార్యకలాపాలకు అడ్డగా మారింది దీనికి ప్రధాన కారణం ఎక్కడ లేని విధంగా హిందు
మనోభావాలను దెబ్బ తీసేలా ఇక్కడ మద్యం ఏరులై పారుతుంది. దీని వల్ల భక్తుల
ఆధ్యాత్మిక భావనకు ఆటంకం కలుగుతుంది.
పైన భక్తి కింద ఇంకోటి అన్న చందంగా మారింది..దీనికి అడ్డు కట్ట వేయాలనే
ఉద్యేశ్యం తో ఇప్పటికె పలు ప్రజా సమస్యల పరిష్కరినికి కృషి చేస్తూ..ప్రజా
ప్రయోజనాల కోసం పాటుపడుతున్న హై కోర్ట్ న్యాయవాది తీగల రాంప్రసాద్
వేములవాడ రాజన్న క్షేత్రానికి 10 కిలోమీటర్ల పరిధిలో మద్యం అమ్మకాలు
నిషేదించాలని పిల్ దాకలు చేసారు. దీని పై ప్రభుత్వం చర్య తీసుకొవాలని
మద్యం అమ్మకాలను నిషేదించాలని త్వరలో లోనే మధ్య రహిత వేములవాడ ను చూడాలని
కోరుకుందాం... అల్ ది బెస్ట్ రాంప్రసాద్ గారు ..."


No comments:
Post a Comment