Wednesday, 28 August 2013

జ్వరం...

జ్వరం...
ఏమైందో తనువుకు 
నా అణువుకు 
మనసుకు 
ఆత్మకు 
జ్వర జ్వలితమై 
మండుతున్నది...

ఇది ఒట్టి దేహానికా
ఆత్మ కరవైన
మనసుకా...

నీవు లేని ఈ క్షణాలన్నీ
నన్ను నిప్పుల కొలిమిలో కాల్చుతున్నా...

ఏదో తెలియని చేదుతనం నాలుకను అంటుతున్నా...

గుండె గది మూలల్లో దాగలేని
దాచలేని ఓ మూల్గు 
తీ

గా...

నీ కోసమే అన్వేషణ...!

నా జీవితం ఒక పుస్తకం అయితే.. అందులో ఒక పాఠం నువ్వు..."
నీ వల్ల తెలుసుకున్న నిజాలు ఎన్నో.. నేర్చుకున్న అనుభవాలు ఎన్నో..!
ఈ ఐదు సంవత్సరాల నీ పరిచయ ప్రయాణం నాకు మరుపురాని అనుభూతుల సంగమం...!
నువ్వు రావు అని తెలుసు... అయిన నీ కోసమే అన్వేషణ...!
-నీ సన్నీ

చాలా చాలా మిస్ అవుతున్నా.. !

చాలా చాలా మిస్ అవుతున్నా.. !
---------------------------------
ఆఫీస్ లో అలసిపోయి ఆలస్యం గా ఇంటికి వస్తే…
అక్కున చేర్చుకునే అమ్మ ఒడికి దూరంగ…
తప్పు చేస్తే ‘అలా కాదు రా.. ఇలా చేయాలి’ అని..
సరిద్దుకోవడానికి సలహాలిచ్చే నాన్నకి దూరంగ…
మంచైన-చెడైన, చేదైన-తీపైన, సంతోషమైన-బాధైన…
పంచుకునే స్నేహితులకు దూరంగ…
ఇంట్లో సరదా-సరదాగ ఎప్పుడు తిట్టుకుంటూ ..
కొట్టుకుంటూ ఉండే అన్నా-తమ్ముడికి దూరంగ..
మా వీధి వాళ్ళ పలకరింపులకు,
ఇంట్లో పిల్లలు చేసే అల్లర్లకు..
ఇలా చాలా చాలా వాటికి దూరంగ..
అలా దగ్గరలేని దూరం లోను…. మరీ దూరం లేని దగ్గరలోనూ..
ఓ మాదిరి దూరంగా ఉంటున్నాను..!
20 ఏళ్ళూగ ఇంటిపట్టున ఉన్న నేను సడెన్ గా సిటీకొచ్చేసరికి..
అంతా అయొమయంలో ఉన్నాను..
వారానికి ఒకటి లేదా రెండు సినిమాలు..
ఫ్రెండ్స్/కొలీగ్స్/రిలేటివ్స్ దగ్గరికి..
అలా కాల్షీట్స్ లేని బిజి షెడ్యుల్ గా ఉండేది..
కానీ ఇప్పుడు అమ్మానాన్నకి దూరంగా ఉండటం..
ఏదైనా ఫంక్షన్ కు పోవాలంటే దూర ప్రయాణం..
ఫ్రెండ్స్ పెళ్లిళ్లకు పోలేకపోవడం.
ఇక పండుగలు, పబ్బాలు.. అంతకు మించి..
క్లొజ్ కొలీగ్స్, ఫామిలీ, ఊర్లు తిరగడం, రిలేటివ్స్,..
ఫ్రెండ్స్, ఫంక్షన్స్, ఎంటెర్-టైన్-మెంట్స్, ఇలా ఎన్నెన్నొ అన్నీ మిస్ అవుతున్న !!!
కొన్ని కావలంటే మరి కొన్ని వదులుకోవాలి అన్నట్లు..
ఇష్టమైన రంగం లో రాణించుదామని..ఏదొ పొడిచేద్దమని..
ఊరి నుంచి ఇక్కడికొచ్చా.. పొడవటం ఏమో కానీ..
ఇక్కడ నుంచి వీలైనంత తొందరగా మా ఊరికి పోవాలని ఉంది

జీవితం...!

కంచాలలో తిని మంచాలమీద ఆరుబయట వెన్నెలలో పట్టే సుఖ నిద్ర
లంచాలను మరిగి భవనాలలో తిరిగినవారికి తప్పదు ఈ లోప ముద్ర!
చింతలు లేని ఇంట్లో అనునిత్యం దడికట్టిన సందడితో సదా నిర్భయం
ప్రహారీగోడ చుట్టూవున్నా, తలవంపులు తెచ్చే దాడులతో నిత్య భయం!
ఇంద్రభవనాలు భోగభాగ్యాలు, అను నిత్యం చచ్చిబతికే వాసయోగ్యాలు
నందనవనాలు వెన్నెల కవనాలు, ప్రకృతి ప్రసాదించిన సుఖవాసాలు..."

వేశ్య..."


వేశ్య కూడా ఆడదే
అమ్మవడిలో లాలిపాటని
నాన్న భుజాలపై మమకారాన్ని
ఆడతనానికి ఆభరణం లాంటి శీలం విలువ తెలిసిందే !

ఆకలికే తెలియంది అంగడిలో లాగే ముందు
ఆడతనం విలువ !
పూట పూటకి కామంధుల ఆకళ్ళు తీర్చాలని
విసిరే నాలుగు నోట్ల కోసం
వీధి విస్తరవ్వాలని !

కళ్ళతో చూసేదంతా నిజం కాదు
నువ్వు ఛీ అన్నా ఆ కష్టం తీరేది కాదు
వీలుంటే సంస్కరించు
లేదంటే నీ దారిన నువ్వు పో !
రోడ్డున పోయే ప్రతీ దానయ్య సంఘసంస్కర్త అంటే ఎలా
సమాజం లో నువ్వు చూడలేని చీకటి కోణాలెన్నో
ఆడతనాన్ని నిందించకు
అవసరాన్ని నిందించు... వీలుంటే నిర్మూలించు ..... !

అలుపెరుగని ప్రయాణం..."

కలలనన్నీ మోసుకుంటూ
జ్ఞాపకాల వెంట అడుగులేస్తూ
గుండెల్లో అగ్ని పర్వతాన్ని రాజేస్తూ
వెన్నెలనింత దోసిట పట్టి
ఉదయిస్తున్న సూరీణ్ణి ఆహ్వానిస్తూ
పచ్చదనాన్ని నేలంతా పరుచుకుంటూ
సాగుతున్న

అలుపెరుగని ప్రయాణం
ఊరి చివర
ఖండితుని శిరస్సులో
నవ్వునద్దేంత దాకా...


రచ్చ రమ్య.."

ఈ యాంకరమ్మను చూసారా...రోజు V6 న్యూస్ లో తీన్మార్ వార్తలతో రచ్చ చేసే మన రచ్చ రాములమ్మ...ఎంతో ఉత్సాహంతో ఉర్రుతాలుగించే ఈమె అసలు పేరు రమ్య.. ఫిజియోథెరపీ స్టూడెంట్. థర్డ్ ఇయర్ చదువుతుందట..మొత్తానికి రమ్య అలియాస్ రాములమ్మ తన మాటలతో చాల మంది అభిమానులనే సంపాదించుకుంది. అల్ ది బెస్ట్ రచ్చ రాములమ్మ.."
@ సన్నిజర్నలిస్ట్